వేసవి హీట్ ను మించి ఏపీలో పొలిటికల్ హీట్

Publish Date:Apr 11, 2023

Advertisement

వేసవి హీట్ ను మించి ఏపీలో రాజకీయ హీట్ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ  పార్టీలు ఇప్పటి నుంచే విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.  అందులోభాగంగా రాష్ట్రంలో  స్టిక్కర్ వార్.. జరుగుతోంది.  ఇక  విమర్శలు.. ప్రతివిమర్శల జోరు సరేసరి. తాజాగా అధికార జగన్ పార్టీ.. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ఇంటింటికీ స్టిక్కర్ వేసే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ప్రజల్లోకి వెళ్తోంది. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ.. తన దైన శైలిలో ఈ కార్యక్రమంపై వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. మా దరిద్రం నువ్వే జగనన్న అంటూ పంచ్ డైలాగ్‌లు పేలుస్తోంది. అలాగే మీ బిడ్డను ఆశీర్వదించండి.. మీ బిడ్డకు అండగా నిలవండంటూ సీఎం  జగన్.. వివిధ వేదికలు, బహిరంగ సభలపై నుంచి ఇస్తున్న పిలుపునకు సైతం... మీ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటూ తెలుగుదేశం శ్రేణులు  ఎద్దేవా చేస్తున్నాయి. 

మరోవైపు మా నమ్మకం నువ్వే జగనన్న   కార్యక్రమంపై జనసేన సైతం   స్పందించింది. సంచులేసుకొని, స్టిక్కర్లు అతికించుకొంటూ.. మీ నినాదాలే మీరు చేసుకుంటే వచ్చేది.. నమ్మకం ఎలా అవుతుంది  స్టిక్కర్ సీఎం అంటూ ట్విట్ చేసింది. అలాగే మాకు నమ్మకం లేదు జగన్.. మాకు నమ్మకం పవన్ అనే స్టిక్కర్లు తిరుపతిలో దర్శనమిస్తున్నాయి. జగన్ పార్టీ స్టిక్కర్ల పక్కనే ఈ స్టిక్కర్లను జనసేన పార్టీ శ్రేణులు అంటిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు సభలకు ప్రతిగా సభలు... ర్యాలీలకు పోటీగా ర్యాలీలు... దాడులకు పోటీగా ప్రతి దాడులు... విమర్శలకు దీటుగా ప్రతి విమర్శలకు తోడు ఇప్పుడు ఈ స్టిక్కరింగ్ వార్ ఆ జాబితాలో చేరిందని చెప్పవచ్చు.

జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అవుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు..  షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. అయితే   ఈ ఏడాది చివరిలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న చర్చ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకొంది. అదీ కాక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఎన్నికలకు అట్టే సమయం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం   జగన్.. ఫిబ్రవరి 7వ తేదీన నువ్వే మా భవిష్యత్త జగనన్న అంటూ స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

ఆ క్రమంలో 1.60 కోట్ల కుటుంబాలను వీరంతా సందర్శించి.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాల గురించే కాకుండా.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పలాల గురించి కూడా వారికి వివరిస్తున్నారు. 

ఆ క్రమంలో 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ సైతం ఇస్తారు. దీంతో ఈ కుటుంబం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉందని ఆ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వస్తుందని తెలుస్తోంది. అయితే మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు గుప్పించడంపై సోషల్ మీడియాలో ఈ స్టిక్కరింగ్ వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది.

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.