తెలంగాణలో ఆట మొదలైంది !

Publish Date:Jul 5, 2022

Advertisement

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..అనేది పాత సామెత, మోడీ, షా జోడీ  తలచుకుంటే, సీబీఐ,ఈడీ దాడులకు కొదవా అన్నది, కొత్త సామెత. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం, అదే అభిప్రాయంతో ఉన్నాయి. అదే ఆరోపణ చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగింఛి, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను మోడీ, షా జోడీ పడగొడుతున్నాయని.కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, సుప్రీం కోర్టు, సీబీఐని, ఏకంగా, కేంద్ర ప్రభుత్వం పలకమన్నపలుకులు పలికే, ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది. అలాగే, ఇప్పడు మోడీ ప్రభుత్వం హయాంలోనూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు అందుకుభిన్నంగా వ్యవహరించడం లేదు.   ఈ మధ్యకాలంలోనే నేషనల్  హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సామాన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని ఐదారు రోజుల పాటు విచారించింది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. మహా రాష్ట్రలో మహ వికాస్ అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే కారణమని, అన్ని పార్టీలు ఆరోపించాయి. 

ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో ఇంతవరకు తొమ్మిది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు కులిపొయాయి. నిజానికి, మోడీ షా జోడీకి ఇదొక ఆటగా మారిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ ఆటలో ప్రతిపక్షపార్టీలు తక్కువ తిన్నాయా, అంటే లేదు. మహారాష్ట్ర విషయాన్నే తీసుకుంటే, 2019  ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీకి వచ్చిన (106) సీట్లలో కొంచెం అటూ ఇటుగా సగం సీట్లు (55) వచ్చిన  శివసేన ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుపట్టి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది.

కాంగ్రెస్, ఎన్సీపీ’ లతో  చేతులు కల్పింది. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా, మూడు పార్టీల కూటమి,  మహా వికాస అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పడు ఆ అఘాడీ ప్రభుత్వంలో అగాధంలో కూరుకుపోయింది. సో .. మహా రాష్ట్ర విషయంవరకు పొలిటికల్ జస్టిస్, పొయిటిక్ జస్టిస్ ఫుల్ఫిల్  అయ్యాయి అనుకోవచ్చునని, టిట్  ఫర్  టాట్’ పడతిలోనే బీజేపీ శివసేనను చీల్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని  బీజేపే అనుకూల మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  
సరే, అది వేరే విషయం’ ఇప్పడు మోడీ షా నజర్, తెలంగాణ మీద పడింది. అయితే, మహారాష్ట్ర టైపులో ఇప్పటి కిప్పుడే తెరాస ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయక పోవచ్చును, కానీ, 2023 ఎన్నికలకు ముందు తెరాస ఆర్థిక ములాలపై దెబ్బకొట్టడం ఖయామని, అంటున్నారు. అంతే కాదు, అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్’ వర్క్ తెరాస ఎంపీ నామా నామా నాగేశ్వ‌ర‌రావు ఆస్తుల జప్తుతో మొదలైందని అంటున్నారు. 

 కాగా, నామా నాగేశ్వ‌ర‌రావుకు చెందిన మ‌ధుకాన్ గ్రూప్’ కు చెందిన  రూ.96 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల  అభ్యర్ధి  య‌శ్వంత్ సిన్హాకు మద్దతుగా, తెరాస సమావేశం  నడుస్తున్న సమయంలోనే, రాష్ట్రం లోపలా వెలుపలా ఉన్న నామా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాబితాలో, ఇంకా పెద్ద చేపలే ఉన్నాయని అంటున్నారు. 

నామా త‌ర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుంది, అయన బాగోగులు చూసే, ఒక రాజ్యసభ సభ్యునితో పాటుగా. ఒక లేడీ ఎమ్మెల్సీ పై  బీజేపీ దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. ఆ ఇద్దరికి సంబందించిన ఆస్తులు, వ్యాపారాలు, బినామీ వ్యవఝారలపై ఈడీ ఆరా తీస్తోంద‌ని, తెలుస్తోంది. ఈ ఇద్దరు నెక్స్ట్ టార్గెట్ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. నిజానికి, ఇందుకు సంబదించిన పక్కా సమాచారంతో సదరు ఎంపీ, ఎమ్మెల్సీలను తెరాస నాయకత్వం అప్రమత్తం చేసిందని అంటున్నారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు దేశంలో ఉన్నారా, లేదా అనే విషయంలోనూ అనుమానాలున్నాయని అంటున్నారు. అదే నిజమైతే, తెలంగాణలోనూ మోడీ, షా జోడీ అసలు అట మొదలైందని అనుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు, తెరాస సర్కార్’ను కూల్చే ప్రయత్నం జరగక పోయినా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బీజేపీకి 20- 30 సీట్లు వచ్చినా, ఆ తర్వాత, మహా రాష్ట్ర తరహాలో మూడు పార్టీల (తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, ఆ ప్రభుత్వం మనుగడ ముడునాళ్ళ ముచ్చటే అవుతుందని, బీజేపీ ప్రస్తుతం అదే వ్యూహంతో అడుగులు వేస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.