అధీర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Publish Date:Jul 29, 2022

Advertisement

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై  శుక్రవారం (జులై 29) నాటికి పది రోజులు. కానీ, ఇంతవరకు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగింది లేదు. ఏ రోజుకారోజు ఏదో ఒక వివాదంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభల నుంచి  ఓ పాతిక మంది వరకు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. నిజానికి, ఇలా పార్లమెంట్ సమావేశాల పేరిట ప్రజాధనం వృధా పద్దులో కొట్టుకు పోవడం,ఇదే మొదలు కాదు. ఇంతకు ముందు కూడా ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే ప్రజాధనం వృధా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  

అయితే ప్రస్తుత సమావేశాలలో రెండు కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమావేశాలలో గౌరవ సభ్యులు, స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా, ఓ గిరిజన మహిళ, ద్రౌపతి ముర్మును భారత రాష్టపతిగా ఎన్నుకున్నారు. ఒక గిరిజన దళిత మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుని గౌరవించిన సభలోనే, అదే గిరిజన దళిత మహిళకు అవమానం జరిగింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి, పొరపాటునే కావచ్చును, ‘రాష్ట్రపత్ని’ అని  సంభోదించారు. నిజానికి, అధిర్ రంజన్ చౌదరి తప్పు తెలుసు కున్నారు. భారత రాష్ట్రపతిని అగౌరవ పరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, పొరపటున నాలుక దొర్లిందే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదని విచారం వ్యక్త పరిచారు.

రాష్ట్రపతి ముర్ముకి క్షమాపణ చెప్పడానికి కూడా అంగీకరించారు. అయితే చౌదరి క్షమాపణ చెపితే సరిపోదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని, మహిళా మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ సహా బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్ చౌదరి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాను కించపరిచేలా ఉన్నాయని,  భారతీయ విలువలకు విరుద్ధమని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సోనియా గాంధీకి, స్మృతీ ఇరానీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సభ మరోరోజు వాయిదా పడింది. అదలా ఉంటే, అధీర రంజన్ చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలే కాదు,  వెలుపల కుడా దుమారం రేపుతున్నాయి. మధ్య ప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  మరోవంక జాతీయ మహిళా కమిషన్ కూడా అధీర్ రంజన్ చౌదరికి నోటిసు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. 

నిజమే, అధీర్ రంజన్  చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసిన వ్యాఖ్యలే అయినా, సారీతో సరిపుచ్చుకునేంత చిన్న పొరపాటు కాదు. చాలా పెద్ద పొరపాటు. పొరపాటు కుడా కాదు. ఒక మహాపరాధం, అందులో సందేహం లేదు. అందుకే, ఆయన లోక్ సభ సభ్యత్వాని రద్దు చేయాలనే డిమాండ్ కుడా వినవస్తోది. నిజమే, పార్లమెంట్ సాక్షిగా జరిగిన పరాభవానికి, అయన పై కఠిన చర్యలు అవసరం.  ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు, కాంగ్రస్ పార్టీ తీసుకుంటుందా. లోక్ సభ స్పీకర్ తీసుకుంటారా? అనేది పక్కన పెడితే, ఆయనన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం సముచితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

అయితే, అదే అయితే, అయన వ్యాఖ్యలపై సభలో చర్చ, చోటుచేసుకున్న వాదోపవాదాలు, సభ ఔనత్యాన్ని, రాష్ట్రపతి గౌరవాన్ని కానీ, ఇనుమడించేలా  ఉన్నాయా? మరింత అవమాన పరిచేలా ఉన్నాయా?అనేది కూడా ఆలోచించవలసి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.