చింతామ‌ణితో రాజ‌కీయ చిచ్చు.. జ‌గ‌న్నాట‌కంలో ర‌ఘురామ ట్విస్టు..

Publish Date:Feb 4, 2022

Advertisement

జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ డేంజ‌రస్‌ పాలిటిక్స్‌కు వేదిక‌గా మారింది. పైకి క‌నిపించేది ఒక‌టి.. లోలోన జ‌రిగేది ఇంకోటి. జ‌గ‌న్‌- వైశ్యులు- చింతామ‌ణి- ర‌ఘురామ‌ల మ‌ధ్య రాజ‌కీయ చ‌ద‌రంగం న‌డుస్తోంది. ఎవ‌రికి వారు తెలివిగా పావులు క‌దుపుతున్నారు. ఎవ‌రు ఎవ‌రికి చెక్ పెడుతున్నారో క్లారిటీ లేదు. కానీ, చింతామ‌ణి నాట‌కంపై రాజ‌కీయం మాత్రం రంజుగా సాగుతోంది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఎంట్రీతో మ‌రింత ర‌క్తి క‌డుతోంది. చింతామ‌ణి చుట్టూ అల్లుకున్న చిక్కుముడుల‌న్నీ విప్పుతుంటే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. 

ఎంపీ ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా ఆర్య‌వైశ్య సంఘాలు న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. రోజుకో ప్లేస్‌, టైమ్ ఫిక్స్ చేసుకొని మ‌రీ.. ర‌ఘురామకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శాంతికాముకులైన‌ వైశ్యుల కోపానికి కార‌ణం.. చింతామ‌ణి నాట‌కం నిషేధాన్ని ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ హైకోర్టులో కేసు వేయ‌డం. అంత‌మాత్రానికే ఆర్య‌వైశ్యుల‌కు అంత కోపం వ‌చ్చేసిందా అంటే.. వారి వెనకాల వైసీపీ పెద్ద‌లు ఉన్నార‌ని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదులే. వైసీపీ వెన‌కుండి.. వైశ్యుల‌ను ముందుంచి.. ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేయిస్తోంద‌నేది ఓపెన్ టాక్‌. 

మ‌రి, ర‌ఘురామ ఏమైనా చేయ‌కూడ‌ని ప‌ని చేశారా? చిన్నచిన్న కార‌ణాల‌తో ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న నాట‌కాన్ని నిషేధించిన నియంతృత్వ పోక‌డ‌నే ఆయ‌న ప్ర‌శ్నించింది. అంతేగాని, వైశ్యుల‌ను అవ‌మానించాలనే ఉద్దేశ్యం ఆయ‌న‌లో ఉండి ఉండ‌క‌పోవ‌చ్చు. హైకోర్టు సైతం ర‌ఘురామ పిటిష‌న్‌పై పాజిటివ్‌గా స్పందించ‌డం చూస్తుంటే.. ఆయ‌న చేసింది క‌రెక్టే అనిపించ‌క మాన‌దు. కేవ‌లం, ఓ నాట‌కంలో ఓ క్యారెక్ట‌ర్ కొన్ని వ్యాఖ్య‌లు చేసినంత మాత్రాన‌.. మొత్తం నాట‌కాన్నే నిషేధించ‌డం స‌రికాద‌న్న‌ట్టు న్యాయ‌స్థానం సైతం అభిప్రాయ‌ప‌డింది. ర‌ఘురామ చేసిన ప‌నిని తెలుగు నాట‌క‌, సాహిత్య ప్రియులంతా హ‌ర్షిస్తున్నారు కూడా. ఇప్పుడు చింతామ‌ణిపై నిషేధాన్ని ప్ర‌శ్నించ‌క‌పోతే.. ముందుముందు మ‌రో నాట‌క‌మో, న‌వ‌ల‌నో గొంతు మూసే సాహ‌సానికి తెగ‌బ‌డే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు.  

మ‌ళ్లీ వైశ్యుల విష‌యానికి వ‌ద్దాం. తెలివైన వారిమ‌ని చెప్పుకునే ఆ వ‌ర్గ‌మంతా.. ఇలా ర‌ఘురామ‌ను కార్న‌ర్ చేసే తెలివి త‌క్కువ ప‌ని చేస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. చింతామ‌ణితో జ‌గ‌న‌న్న ఆడుతున్న ఆట‌ను.. వైశ్యులు గుర్తించ‌లేక పోతున్నారా? లేక‌, అన్నీతెలిసే అన్నీమూసుకుని ఉన్నారా? అనే అనుమానం రాక‌మాన‌దు. ప్ర‌స్తుతానికి ర‌ఘురామ టైమ్ బాగా లేదు కాబ‌ట్టి.. ఆయ‌న‌పై ఎంతెత్తు ఎగిరినా ఏమీ కాద‌ని.. పైగా అధికార ప‌క్షం స‌పోర్టూ ఫుల్లుగా ఉంటుంది కాబ‌ట్టి.. న‌ర‌సాపురంలో నిర‌స‌న‌లు చేస్తున్నారు కానీ.. అస‌లు వైశ్యుల‌ను దారుణంగా అవ‌మానించిన జ‌గ‌న‌న్న అండ్ బ్యాచ్ జోలికి వెళ్లాలంటే ఆ వ‌ర్గానికి వ‌ణుక‌నే చెప్పాలి. అస‌లే, వ్యాపారాలు చేసుకునే వాళ్లు క‌దా.. ఆమాత్రం భ‌యం ఉంటుందిలెండి అది వేరే విష‌యం. 

అస‌లు చింతామ‌ణి నాట‌కం నిషేధం వెనుక ఎంత పెద్ద‌ రాజ‌కీయం న‌డిచిందో కాస్త ఆలోచిస్తే ఈజీగానే అర్థ‌మైపోతుంది. మాజీ గ‌వ‌ర్న‌ర్‌, మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్య‌వైశ్య జాతిర‌త్నం.. రోశ‌య్య అస్త‌మ‌యం నుంచి మొద‌లైంది అస‌లు క‌థ‌. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌న‌కు ద‌క్కాల్సిన ముఖ్య‌మంత్రి సీటును.. రోశ‌య్య కొట్టేశార‌నే అక్క‌సుతో.. ఆ పెద్దాయ‌న చ‌నిపోతే చివ‌రి చూపు చూట్టానికి కూడా వెళ్ల‌లేదు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండి.. అంత‌టి కుంచిత స్వ‌భావం చూపించ‌డాన్ని అప్ప‌ట్లోనే అంతా త‌ప్పుబ‌ట్టారు. వైశ్య వ‌ర్గాలు జ‌గ‌న్ తీరుపై మండిప‌డ్డాయి. అది జ‌రిగిన కొన్నాళ్ల‌కే.. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మ‌రింత అగ్గి రాజేసింది. 

పాపం.. ఆ ఒంగోలు గుప్తా చేసిన త‌ప్పేమీ లేదు. జగన్ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా చోటు చేసుకుంటున్న అరాచకం.. దాని వల్ల భవిష్యత్తులో పార్టీకి, కేడర్‌కు ఎదురయ్యే ఇబ్బందులపై మాట్లాడారు అంతే. ఆ చిన్న‌పాటి స‌ల‌హాల‌నే భ‌రించ‌లేక‌పోయారు వైసీపీ నేత‌లు. సొంత పార్టీ నాయ‌కుడ‌ని కూడా చూడ‌కుండా.. సుబ్బారావు గుప్తాను వెంటాడి.. వేటాడారు. గుప్తా మీద‌కు.. త‌న ప్ర‌ధాన అనుచ‌రుడైన ఓ రౌడీ షీట‌ర్‌ను ఉసుగొల్పి దాడి చేయించారు మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అలియాస్ వాస‌న్న‌. గుప్తాను కొట్టి.. మోకాళ్ల‌పై కూర్చోబెట్టి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పించేదాకా వద‌ల‌లేదు ఆ వైసీపీ మూక‌. సుబ్బారావుపై దాడి జ‌ర‌గ‌డం, ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కావ‌డంతో.. ఆర్య‌వైశ్యుల మ‌నోభావాలు బాగా దెబ్బ‌తిన్నాయి. అప్ప‌టికే రోశ‌య్య ఎపిసోడ్‌తో జ‌గ‌న‌న్న‌పై గుర్రుగా ఉన్న వైశ్యుల‌కు, గుప్తాపై బాలినేని అనుచ‌రుల దాడి మ‌రింత ఆగ్ర‌హం తెప్పించింది. జ‌గ‌న్‌కు, వైసీపీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు సిద్ద‌మ‌య్యారు ఆర్య వైశ్యులు. ఆ విష‌యం గుర్తించిన అగ్ర‌నేత‌లో కొంత ఆందోళ‌న చెంది.. వెంట‌నే న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంత్రి బాలినేని.. సుబ్బారావు గుప్తాకు కేకు తినిపించి కాస్త కూల్ చేసే ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఆ త‌ర్వాత అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హాన్ని ఒంగోలులో ఏర్పాటు చేయిస్తానంటూ స‌న్నాయినొక్కులు నొక్కారు. అయినా, వైశ్యుల ఆగ్ర‌హం చ‌ల్లార‌క‌పోవ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేక వాయిస్ పెర‌గ‌డంతో ఇక లాభం లేద‌ని తాడేప‌ల్లి పెద్ద‌లే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. 

ఆర్థికంగా బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న ఆర్య వైశ్యుల‌తో పెట్టుకుంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని గుర్తించిన వైసీపీ పెద్ద‌లు.. రోశ‌య్య‌, సుబ్బారావు గుప్తాల‌తో జ‌రిగిన డ్యామేజీని కంట్రోల్ చేయ‌డానికి.. ఆ వ‌ర్గం ఏనాటి నుంచో డిమాండ్ చేస్తూ వ‌స్తున్న‌ చింతామ‌ణి నాట‌కాన్ని స‌డెన్‌గా నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది వైసీపీ ప్ర‌భుత్వం. ఆ ప‌రిణామంతో అంతా ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయారు. అదేంటి.. ఇప్పుడెవ‌రూ అడ‌క్కుండానే.. ఎవ‌రూ రోడ్డెక్క‌కుండానే.. ఎవ‌రూ ఉద్య‌మాలు, ధ‌ర్నాలు చేయ‌కుండానే.. వైశ్యుల కోరిక మేర‌కంటూ.. చింతామ‌ణి నాట‌కానికి ప‌ర్మినెంట్‌గా శుభం కార్డు వేయ‌డం.. వైసీపీ ఆడుతున్న రాజ‌కీయ నాట‌క‌మ‌ని ఇట్టే అర్థ‌మైపోతోందని అంటున్నారు. ఇంత చిన్న విష‌యం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆర్య వైశ్య సంఘాల‌కు అర్థ‌మైనా.. అర్థం కాన‌ట్టు న‌టిస్తూ.. కోర్టులో కేసు వేశార‌నే కార‌ణంతో ఎంపీ ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారని చ‌ర్చించుకుంటున్నారు. 

వైశ్యుల మ‌నోభావాలు అంత‌లా దెబ్బ‌తింటే.. రోశ‌య్య చ‌నిపోతే వెళ్ల‌ని జ‌గ‌న్‌రెడ్డిని నిల‌దీసి ఉండాల్సింది. ఆ త‌ర్వాత సుబ్బారావు గుప్తాను కొట్టిన‌ప్పుడైనా రాష్ట్ర‌వ్యాప్తంగా రోడ్డెక్కాల్సింది. ఆ రెండు సంద‌ర్భాల్లో పెద్ద‌గా నోరెత్త‌ని ఆ వ‌ర్గం.. ఇప్పుడు మాత్రం ఎంపీ ర‌ఘురామ కోర్టులో కేసు వేశారంటూ నిర‌స‌న‌లు చేస్తుండ‌టం విడ్డూర‌మే.. రాజ‌కీయ దురుద్దేశ్యమే..అంటున్నారు. ఈ సంద‌ర్భంగా సింగిల్ హ్యాండ్‌తో త‌న‌కు జ‌రిగిన అన్యాయం, త‌న‌పై జ‌రిగిన దాడిపై ఒంట‌రి పోరాటం చేస్తున్న సుబ్బారావు గుప్తాను కులమ‌తాల‌కు అతీతంగా అంతా అభినందిస్తున్నారు. పోలీసులు త‌న‌కు న్యాయం చేయ‌డం లేద‌ని, ఏపీలో త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ.. ఏకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు సుబ్బారావు గుప్తా. కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే త‌న‌ను కాపాడాలంటూ ఆయ‌న్ను క‌లిసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నమే చేస్తున్నారు. ఆర్య‌వైశ్యులకు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే.. వారి వెనుక ఎలాంటి రాజ‌కీయ శ‌క్తులు లేవ‌ని నిరూపించుకోవాలంటే.. త‌మ వాడైన‌ సుబ్బారావు గుప్తాకు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. అంతేకానీ, ఎవ‌రి ప్రోద్బలంతోనో ఎంపీ ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటే ఉప‌యోగం ఏముంటుంద‌ని.. ఎవ‌రి ప్ర‌యోజ‌నం కోసమో.. త‌మ ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చింత‌మణి నాట‌కంపై నిషేధం ఎలాగూ కోర్టులో నిల‌బ‌డేది కాదంటున్నారు.. అంత‌వ‌ర‌కూ ఈ చింతామ‌ణి రాజ‌కీయ నాట‌కానికి శుభం కార్డు ప‌డ‌క‌పోవ‌చ్చు. 
 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.