సీఎం కామెంట్స్ పై పొలిటికల్ క్లౌడ్ బరస్ట్

Publish Date:Jul 17, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన, ఈ మాట మేఘాల మాటేమో కానీ, రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు, వరదలు, ప్రజల కష్టనష్టాల విషయం పక్కకు పోయింది, కాళేశ్వరంలో మునక వివాదమూ పక్కకు పోయింది. ‘క్లౌడ్డ్ బరస్ట్’ చుట్టూనే రాజాకీయ దుమారం చెలరేగుతోంది., రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కావచ్చని, అనుమానం వ్యక్తం చేస్తూనే, ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశాల కుట్ర  కోణాన్ని కూడా తెరమీదకు తెచ్చారు.  
నిజానికి, ముఖ్యమంత్రికి అలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అందుకు సంబదించి సమాచారం ఏదైనా తమ వద్ద ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే, ఎవరికీ అభ్యతరం ఉండేది కాదు. పోనీ కేంద్రంతో మాటలు లేవు, కాబట్టి, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక  పోయినా, సంబంధిత అధికారాలను లేదా శాస్త్ర వేత్తలను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినా  అదో రకంగా ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ అదేమీ లేకుండా, ఒక మాట అనేశారు. నిజానికి, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ నాయకులు ఇలాంటి అసత్యాలు, అర్థ సత్యాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. అందులోనూ, కేసీఆర్  అలాంటి విద్యలో సిద్దహస్తులనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. 
ముఖ్యమంత్రి కనీసం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులను సంప్రదించినా, కొంత క్లారిటీ వచ్చేది కావచ్చును. నిజానికి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తనకైతే క్లౌడ్ బరస్ట్ గురించి పెద్దగా తెలియదని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకు  వాతావరణ హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా మాత్రమే వర్షాలు కురిసి వరదలు సంభవించాయని చెప్పారు. అంటే, ముఖ్యమంత్రి చెప్పిన క్లౌడ్ బరస్ట్ కథ కట్టు కథ కావచ్చనే అనుమానం వ్యక్త పరిచారని అనుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఏ ఆధారాలు లేకుండా, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని, బహిరంగ ప్రకటన ఎందుకు చేశారు? ఏ ఉద్దేశంతో, ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే. గతంలో ఒకసారి  కశ్మీర్’లోని లద్ధాక్ – లేహ్’లో మరోమారు ఉత్తరఖండ్ లో చేశారని అన్నారు. ఈమధ్య గోదావరి పరివాహక ప్రాంతంలోనూ చేస్తున్నారని గ్లూమీ .. గ్లూమీ ( అస్పష్ట) సమాచారం ఉందని అన్నారు. కావచ్చును, ముఖ్యమంత్రి ఏదీ  నిర్దారణగా చెప్పా లేదు, ఎవరి మీద వేలెత్తి చూపలేదు. కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమకే స్పష్టత లేని సమాచారం ఆధారంగా, అంత సీరియస్ వ్యాఖ్య, ఇంత బేఫర్వాగా ఎలా చేస్తారు, అనేదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో వివాదం అవుతోంది. మరోవంక, చైనా పేరు కూడా తెరమీదకు వచ్చింది. 

నిజానికి వరదల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం బేఫర్వా గానే వ్యవహరిస్తోంది. విపత్తు ముంచు కోస్తోందని హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.నిమ్మకు నీరెత్తి నట్లు వ్యహరిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, కూడా వర్షాలు, వరదల మీద అధికారులతో రివ్యూ చేసినా,  విలేకరుల సమావేశంలో  రెండే రెండు ముక్కల్లో ఆ విషయన్ని తేల్చేశారు. ఆ  తర్వాత రెండున్నర గంటలు రాజకీయ విమర్శలకు వినియోగించుకున్నారు. ఆ తర్వాత, కాళేశ్వరం మునకతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరకు, గవర్నర్ తమిళి సై, వరద పోటెత్తిన భద్రాచలంలో పర్యటించేందుకు కదిలిన తర్వాత గానీ, ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలలో పర్యటించే ఆలోచన చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపద్యంలో ముఖ్యమత్రి క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అయితే, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని స్వయాన సీఎం కేసీఆర్‌ చెప్పడంపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి,హోదాలో మాట్లాడిన మాటలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నుంచి కుట్ర సమచారాన్ని రాబట్టాలన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే కేంద్ర భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాల్సిన భాధ్యత కేసీఆర్‌కు ఉందని గుర్తుచేసిన రేవంత్‌.. అలా చేయని పక్షంలో కేంద్రమే కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు. 

మరో వంక  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు.
అదలా ఉంటే ఇప్పుడు కేసేఆర్ చేసిన,  విదేశీ కుట్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోనూ దుమారం రేపుతున్నాయి.జాతీయ టీవీ చానల్స్’లోనూ కేసీఆర్ వ్యాఖ్యలఫై చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు ఈ ‘పొలిటికల్ క్లౌడ్’  ఎటు తిరుగుతుందో, ఏమౌతుందో ..

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.