ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో  కొనసాగుతున్న పోలింగ్ 

Publish Date:Nov 7, 2023

Advertisement

ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం(నవంబర్ 7) ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌లకు వచ్చే వోటర్లు పెరుగుతున్నారు. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 
చత్తీస్ గడ్ లో మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.  ఈ ఫేజ్ లో  13 స్థానాలు ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఫేజ్ లో కాంగ్రెస్ పార్టీ 6గురు సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం కల్పించారు. రాజ్ నందగాన్  నుంచి మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కాంగ్రెస్ నేత గిరిస్ దేవాన్ గన్ పై పోటీ చేస్తున్నారు. కొంట స్థానం నుంచి చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి కవాసి లక్మా పోటీ చేస్తున్నారు. ఆయన 2018, 2013 ఎన్నికల్లో కొంటా స్థానం నుంచి గెలుపొందారు. కొండగాన్ నుంచి కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు మోహన్ మార్కం పోటీ చేస్తున్నారు. నారాయణ్ పూర్ నుంచి  మాజీ మంత్రి కేడర్ కాశ్యప్ బిజెపి తరపున  పోటీ చేస్తున్నారు. కేశ్ కల్ నుంచి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కవర్ధ స్థానం నుంచి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

 ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత
 ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణలో నక్సలైట్ల సమస్య ఉండేది . ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించాయి మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌లకు  ఎక్కువగా చేరుకుంటున్నారు. కాగా మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు. 
మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 ట్రాన్స్‌జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు మాత్రం డిసెంబర్ మూడో తేదీ వెల్లడవుతాయి.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.