సూట్ కేసులో మృతదేహం.. మిస్టరీ ఛేదించిన పోలీసులు!
Publish Date:Jun 9, 2026
Advertisement
చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఇటీవల దొరికిన సూట్‌కేస్ లో కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు, కాళ్లు లేని ఒక పురుషుడి మృతదేహం లభ్యమై కలకలం రేపిన సంగతి విదితమే. ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. ప్రాథమికంగా మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు. షాపు రికార్డులు పరిశీలించగా, ఆ దుస్తులను ఇద్దరు వ్యక్తులు కలిసి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం దర్యాప్తుకు కీలక మలుపు ఇచ్చింది. తదుపరి దర్యాప్తులో కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ లోకేషన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసులు అనుమానితులను గుర్తించారు. వారు చెన్నైలోని తేనాంపేట, టి.నగర్ ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతుడి భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి జీవించా లనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించు కుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కి పారవేసి నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/police-solve-the-mystery-in-dead-body-parts-in-suitcase-36-222340.html





