ఎన్నికల నేపథ్యంలో వరంగల్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్టు కారులో ఈరోజు వేకువజామున రూ.5,80,65,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ సొమ్ము హవాలా సొమ్మని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నగదు గోషామహల్‌కు చెందిన వ్యాపారి కీర్తి కుమార్ జైన్‌కు చెందినదిగా గుర్తించామన్నారు. కీర్తి కుమార్ జైన్‌తోపాటు అతడి ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం నగదును ప్రజకూటమి అభ్యర్థులకు తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రూ.1.50 కోట్లు, వరంగల్ తూర్పు అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, కాంగ్రెస్ నేత కొండా మురళికి రూ.2.30 కోట్లు కారులో తీసుకెళ్తున్నట్లు సీపీ వెల్లడించారు. పట్టుబడిన నగదును కోర్టు ముందు ఉంచుతామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-seized-money-from-kutami-activists-39-84702.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.