Publish Date:Nov 28, 2021
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నమైంది. అయితే పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ఇప్పటివరకు కాలేజీ విద్యార్థులు ఎక్కువ రేవ్ పార్టీల్లో పాల్గొంటున్నట్లు బయటపడగా.. తాజాగా పట్టుబడిన వారిలో హోమో సెక్సువల్ ఎక్కువగా ఉండటం సంచలనంగా మారింది. కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాల ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు.
యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో హోమో సెక్సువల్స్ ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించుకుంటాన్నరే విషయం కూకల్ పల్లి పార్టీతో బయటపడిందని అంటున్నారు. ఈ పార్టీపై మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-raid-rave-party-in-kukatpalli-39-127276.html
వరద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం (ఆగస్టు 9) రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రిని కింగ్ మేకర్ అని పిలిచారు. లాలూ బిన్ చాలూ ఈ బిహార్ నా హోయీ (లాలూ లేకుం డా బీహార్ నడపలేరు) అని భోజ్‌పురి పాటను ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు. తాజాగా ఆయన తన అస్తుల వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ప్రధాని మోడీ పేరిట స్థిరాస్థులేవీ లేవు.
వైసీపీ బరితెగించేసింది. ఒక సమావేశంలో మాట్లాడుతుండగానే తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనితకు బెదరింపు కాల్ వచ్చింది.మంగళవారం (ఆగస్టు 9)న విజయవాడలో మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అనిత హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతుండగానే అనితకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎత్తిన అనితకు గోరంట్ల మాధవ్ విషయంలో ఎక్కువ మాట్లాడవద్దంటూ బెదరింపులు ఎదురయ్యాయి
తెలంగాణా రాష్ట్రమంతటా ఎంపిక చేసిన 522 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనకు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సినిమా ఆగష్టు తొమ్మిది నుంచి 22వ తేదీ వరకూ ప్రదర్శిస్తారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 నిమిషాల వరకూ ప్రదర్శిస్తారు.
బీహార్ లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీజేపీ-జూడీయూ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అంద జేశారు. ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు
మంత్రి రోజా కొత్త బెంజి కారు ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదిక అయ్యింది. ముచ్చటపడి కుమారుడికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం రోజా కొన్న బెంజి కారు ఆమెకు ఇప్పుడు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరైన రోజా ఇప్పుడు కోటిన్నర బెంజ్ కారు విషయంలో విమర్శకులకే కాదు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు సైతం వివరణ ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడ్డారు. కోటీ యాభై లక్షల రూపాయలు పెట్టి రోజా కొన్న కొత్త మెర్సిడీస్ బెంజ్ కారు.. ఆమెను మరోసారి వివాదాల సుడిగుండంలోకి లాగింది. బెంజ్ కారును కొనడాన్ని ఏకి పారేస్తూ మంత్రిగా రోజా ‘సంపాదన’ చూస్తుంటే కలెక్షన్ క్వీన్ రోజా అనాల్సి వస్తుందని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది.
సైద్ధాంతిక సారూప్యత లేని పొత్తలు దీర్ఘకాలం మన్నవు. ఇదే బీహార్‌లో బీజెపీ ఎదురయిన అనుభవం. ఇన్నాళ్ల బీజేపీ పొత్తును కాదు పొమ్మ న్నారు బీహార్ ముఖ్యమంత్రి నీతిష్
క్యాసినో అంటే డబ్బు కోసం ఆటలు ఆడే ఒక ప్లేస్. ఇక్కడ ప్రధానంగా జరిగేది గ్యాంబ్లింగ్. కాసా(ఇల్లు) అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చిందే క్యాసినో. లక్షల బెట్టింగ్తో ఆడే ఆట అంతా కూడా అదృష్టం మీదనే ఆధాపడుతుంది.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం సోషల్ మీడియాను పట్టి కుదిపేస్తోంది. ఇంత ఛండాలంగా, సిగ్గు లేకుండా వ్యవహరించిన మాధవ్ ను ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే.. ఇలా న్యూడ్ వీడియోతో దొరికిపోయిన మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వైసీపీ అధినేత ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తాత్సారం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ప్రజాప్రతినిధులుగా ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడానికి స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛలేనపుడు మంత్రిమండలిలో ఉండి ప్రయోజనమేమిటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు
తెరాసకు ఇప్పుడు రోజులు కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారో.. ఆ క్షణం నుంచీ గులాబి పార్టీకి వరుస ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ తో యుద్ధం ప్రకటించిన కేసీఆర్ కు స్వరాష్ట్రంలో అసమ్మతి, అసంతృప్తి నేతల తాకిడి సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో అడుగు కలిపి నడిచిన ఒక్కరొక్కరుగా ఆయనకు దూరం జరుగుతున్నారు. అదే సమయంలో వరుసగా రెండు ఉప ఎన్నికలలో విజయం తరువాత రాష్ట్రంలో కాషాయదళం గళం పెంచింది. గతంలో ఏ ఆపరేషన్ ఆకర్ష్ తో అయితే ప్రత్యర్థి పార్టీల బలాన్ని కేసీఆర్ హరించారో ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములాతో బీజేపీ తెరాస గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
చిత్రంగా ఈ విదేశీయులు ఇద్దరూ ఏకం గా తెలంగాణా వచ్చి పనిగట్టుకుని జైల్లో రెండు రోజులు గడిపారు. ఇదేమి ఆనందం. ఆనందమే అదో చిత్రమైన అనుభూతి! ఇద్దరూ టూరిస్టులే.. దొంగలు కారు.