లంచం ఇస్తే పని కచ్చితంగా అవుతుంది.. నోరు జారిన ఉన్నతాధికారి
Publish Date:Dec 21, 2021
Advertisement
ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వనిదే చిన్న ఫైల్ కూడా కదలదని అంటారు. అందుకే ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్లేవారు అమ్యామ్యాలు ఇవ్వాలని సిద్ధమయ్యే వెళుతుంటారు. రెవిన్యూ, మున్సిపల్ విభాగాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. పోలీసుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. పోలీస్ స్టేషన్ లో లంచం ఇవ్వకుండా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదంటారు. లంచం ఇస్తే పోలీసులు కచ్చితంగా పని చేస్తారనే టాక్ కూడా ఉంది. ఈ విషయాన్నే తాజాగా ఓ ఉన్నతాధికారి ఓపెన్ గానే చెప్పేశారు. పోలీసులు లంచం తీసుకుంటే కచ్చితంగా పనిచేస్తారని చెప్పాడు సదరు ఉన్నతాధికారి. ఒక విధంగా పోలీసులు లంచం తీసుకుంటారని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఈ పోలీస్ అధికారి గెస్ట్‌గా వచ్చాడు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. “పోలీసులు డబ్బు తీసుకుంటే పని అయిపోతుంది” అని అన్నాడు. అతడు ఈ మాట మాట్లాడగానే అక్కడున్న జనాలందరు నవ్వారు.‘‘పోలీసుల కంటే మంచి డిపార్ట్‌మెంట్ లేదు.. పోలీసులు డబ్బులు తీసుకుంటే ఆ పని అయిపోతుంది.. వేరే డిపార్ట్‌మెంట్ వాళ్లు డబ్బులు తీసుకుంటారు.. కానీ పని జరగదు.. టీచర్లను చూడండి.. ఇంట్లో ఉంటూ నేర్పిస్తారు. మేము కరోనావైరస్ ఉన్నప్పటికీ అందరి కోసం పనిచేస్తున్నామని” మాట్లాడాడు. లంచం గురించి పోలీస్ అధికారి మాట్లాడిన ఈ మాటలు వివాదాస్పదంగా మారాయి. అతడి వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతడిపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతడు మాట్లాడిన మాటలపై వివరణ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/police-officer-hot-comments-on-bribe-25-128789.html





