పోలీసులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలే అనిపిస్తున్నది. సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఇష్టారీతిగా, అడ్డగోలుగా అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు చేసి విడిచి పెట్టేశారు. 41ఎ నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు రావలని చెప్పి గౌరవంగా సాగనంపారు. అలా సాగనంపడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్రభుత్వ ఆగ్రహంతో వర్రాను అదుపులోనికి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అతడి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు ఇలా వదిలిపెట్టగానే వర్రా రవీంద్రారెడ్డి అలా పరారైపోయారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాతా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నాయకురాళ్లపై అసభ్య పోస్టులు పెట్టారు. పలు ఫిర్యాదుల మేరకు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి కడపకు తరలించి విచారించారు. అయితే బుధవారం తెల్లవారు జామున ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం చూస్తుంటూ వారింకా వైసీపీ అనుకూల మోడ్ లోనే ఉన్నారని అనిపించక మానదు.
వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల సహా పలువురు అప్పటి విపక్ష నేతలపై వర్రా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 41ఎ నోటీసులు ఇచ్చి వదిలేయడం ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. వర్రా రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వర్రా రవీందర్ రెడ్డిని అలా ఎలా వదిలేశారంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం కడప పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కడప పోలీసులు అలర్టై వర్రా రవీందర్ రెడ్డి కోసం గాలింపు ప్రారంభించారు. అయితే పోలీసుల విడిచి పెట్టిన మరుక్షణమే వర్రా రవీందర్ రెడ్డి పరారీ అయ్యారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పరారీ విషయం తెలుసుకున్న వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయాలని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇలా ఉండగా వర్రా రవీందర్ రెడ్డికి 41ఎ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రావాలని ఆదేశించారు. ఆ వెంటనే మరో కేసులో విచారణ కోసం అదుపులోనికి తీసుకో వాలని భావించినప్పటికీ అప్పటికే వర్రా పరారయ్యాడు. వర్రా ఆచూకీ కోసం ఆతని భార్య, సోదరుడు, మరదలును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరా బాద్‌లలో పలు కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా అతడిని విడిచిపెట్టడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-leave-varra-ravinder-reddy-25-187969.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.