మరో వ్యక్తిని.. కొట్టి చంపిన పోలీసులు..  

Publish Date:Jun 23, 2021

Advertisement

ప్రపంచం నలుదిక్కుల ఎక్కడ చూసిన ఇప్పుడు వినిపించే పేరు కరోనా. ఈ కరోనా మహమ్మారి విసిరిన పంజాకి మానవ సమాజం వణిపోతుంది. వరిసేలా విసిరితే చెట్టు మీద పిట్టలు ఎగిరిపోయినట్లు. మనుషుల ప్రాణాలు క్షణంలో  ఎగిరిపోతున్నాయి. ఇంత అభివృద్ధి చెందిన సైన్సు ప్రపంచంలో దాదాపు రెండు పాటుగా విరుచుకుపడుతున్న కరోనని చూస్తూ ఉండడమే కానీ దానికి సరైన వైద్యం లేదు. గ్రహాల మీదికి క్షణాల్లో వెళుతున్నాం, గడ్డి పరకతో వింతలు చేస్తున్నాం, మా దేశం సైన్సు లో ముందు అంజలో ఉంది అని సంకలు గుద్దుకోవడం. వీడే చేశాడు వాడే చేశాడు అని నిందించడం తప్ప.. ఏ ఒక్క దేశం కరోనా వైరస్ ని చెక్ పెట్టడం లేదు. ఇంకా కొంత మంది ముందుకు వచ్చి కరోనా గురించి నిజాలు చెపితే వారికి శిక్షించడం లాంటి పనులు చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా.. కొంత మంది మేధావులు అయితే ఇంతకీ కరోనా అనేది ఉందా ? లేక ప్రజలను నాశనం చేయడానికే కార్పొరేట్ వ్యవస్థ ఈ పనికి పూనుకుండా అని మాట్లాడుతున్నారు.  వారి మాటలు వింటుంటే అప్పుడప్పున అది కూడా నిజమే కావచ్చు అనిపిస్తుంది. సరే ఇది అంత ఒక ఎత్తు ఐతే కరోనా వచ్చిందని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా టెస్ట్ చేయించి తనకు పాజిటివ్ వస్తుందేమో అని కొందరు చనిపోయారు. అలా హాస్పిటల్స్ లో చనిపోయిన వాళ్ళు చంపినా వాళ్ళు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇవి అన్ని ఒక రకం అయితే లాక్ డౌన్ టైంలో బయటికి వచ్చిన వాళ్ళను పోలీసులు కొట్టి చంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా తమిళనాడు లో బయటికి వచ్చారని కొట్టి చంపారు పోలీసులు వివరాల్లోకి వెళితే..

మన దేశంలో కరోనా కారణంగా  పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అక్కడక్కడా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. అయితే, తమిళనాడులో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఇంకా నిర్భంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని చితకొట్టారు. అతను ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. గతంలో చెన్నైలో మొబైల్ షాప్ ఓనర్ ని జయరాజు అతని కొడుకుని కర్ఫ్యూ టైం కి మించి 15 నిముషాలు షాప్ ఓపెన్ చేశాడని పోలీసులు పెద్ద రచ్చ చేసి చివరికి జయరాజును అతని కొడుకును కొట్టి చంపారు.. అది చాలా పెద్ద సంచలనం రేపింది. ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.   లాక్‌డౌన్ లో ఎవరూ బయటకు రాకూడదని అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే, మురుగేషన్ (40) అనే వ్యక్తి పనిమీద సేలం నుంచి ధర్మపురికి బయలుదేరాడు.

మార్గమధ్యలో ఎడప్పురి చెక్ పోస్టు వద్ద అతన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. బయటకు ఎందుకు వచ్చావని చితకబాదారు. కొట్టొద్దని మురుగేషన్ ఎంత ప్రాధేయపడ్డాడు.  అయినా పోలీసులు వినిపించుకోలేదు. దెబ్బ మీద దెబ్బలు కొట్టారు. చివరికి ఆ వ్యక్తి దెబ్బలకు తాళలేక చివరకు  మరణించాడు. విషయం తెలియడంతో స్టేట్ వైడ్ సంచలనం అవ్వగా.. పలువురు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆరా తీసిన ఉన్నతాధికారులు మురుగేషన్ మరణానికి కారణమైన ఎస్సై సహా మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, మృతుడు మద్యం సేవించి తమతో వాదనకు దిగాడని, దీంతో తాము కొట్టాల్సి వచ్చిందని పోలీసులు ఆరోపించారు.

ప్రజా ఆరోగ్యం పట్టని ప్రభుత్వాలు ప్రజలపైనే వాళ్ళ ప్రతాపం చూపిస్తుంది. ఎన్నికల కోసం ప్రజలను పోగుచేసి మీటింగ్ పెట్టొచ్చు. ఆక్సిజన్ అందించకుండా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు తీయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కనీస అవసరాలు లేకుండా చేయొచ్చు. ఎదావిదిగా వైన్స్ లు నడపొచ్చు, చచ్చిపోయిన శవాన్ని తగల పెట్టడానికి అవకాశం లేకుండా చేయొచ్చు. కానీ ప్రజలు ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తే వారిపైన కేసులు, పెడ్దుతున్నరు. దేశద్రోహం ముద్ర వేస్తున్నారు. మాస్క్ లేకుంటే ఫైన్లు వేస్తున్నారు.. ఇదెక్కడి ప్రభుత్వాలు.. అందుకే ప్రజలు ఓట్లు వేసే ముందు ఆలోచించాలి. ప్రజల కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలి.  

By
en-us Political News

  
ఉన్నత విద్య, ఉద్యోగాల  కోసం విదేశాలకు వెళ్లి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భారత విద్యార్థుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 403 మంది భారత విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం  ఇటీవల వెల్లడించింది
ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు..
వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది.
వయసుతో పాటు అభిమానుల సంఖ్యనూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజినీకాంత్
ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే.
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే.
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-12
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.