Publish Date:May 15, 2026
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు వరదరాజ్ సుదేశ్‌పై నేరం నిరూపితమై, పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు వెలువరిం చింది.పోలీసు వృత్తిలో ఉండి సమాజానికి రక్షణగా నిలవాల్సిన వ్యక్తే చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్టు కోర్టు తేల్చింది.ఈ కేసు విచారణలో సమర్పించిన సాక్ష్యాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు దోషిగా నిర్ధారణ కావడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, అదనంగా రూ.12 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇక బాధిత బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం కింద కోర్టులు వేగంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటు న్నాయి. ఈ తీర్పు సమాజం లో బాలల భద్రతపై మరింత అవగాహన పెంచేలా నిలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-constable-sentenced-to-30-years-in-prison-in-pocso-case-36-219928.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.