Publish Date:Mar 12, 2025
జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న సంఘటనలను నాటి పాపాలకు ఇప్పుడు వారంతా శిక్ష అనుభవించడం ఖాయంగా కనిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు, ఆ తరువాత పోసాని కృష్ణ మురళి అరెస్టు.. బెయిలు కోసం పోసాని రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసులో పీటీ వారెంట్ తో పోలీసులు సిద్ధంగా ఉండటం చూస్తుంటే.. జగన్ హయాంలో ఇష్టారీతిగా, నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా వాగిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇప్పుడు తాజాగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కడప జైలులో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని జగ్గయ్య పేట పోలీసలు పీటీ వారెంట్ పై బుధవారం తెల్లవారు జామున జగ్గయ్య పేటకు తీసుకువచ్చారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిలలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్రాపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024లో ఆయన చేసిన వ్యాఖ్యలపై జగ్గయ్య పేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపీ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ కేసు విచారణ నిమిత్తం వర్రా రవీందర్ రెడ్డిని కడప నుంచి పీటీ వారెంట్ పై జగ్గయ్యపేటకు తీసుకువచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి బూతు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలతో జగన్ హయాంలోనే కాదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా రెచ్చిపోయారు.
రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అంతేకాదు రవీంద్ర రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకా హత్యకేసులో జగన్, అవినాష్‌రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అప్పట్లో ఆ పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ తల్లి విజయమ్మపైనా పోస్టులు పెట్టడం సంచలనం రేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీంద్ర రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో వర్రా పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీందర్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-bring-varra-ragavreddy-to-jaggayaapet-on-pt-39-194244.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.