చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్టు
Publish Date:May 5, 2026
Advertisement
చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జీడిమెట్ల పరిధిలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు ఎట్లకేలకు అరెస్టు చేశారు. గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను జల్లెడ పట్టి ముఠాను గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సాయికిరణ్, నవీన్, అనిల్ లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 7.5 గ్రాముల బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, సిల్వర్ రింగ్, ఒక డ్యూక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
http://www.teluguone.com/news/content/police-arrest-chain-snaching-gang-36-219034.html





