Publish Date:Oct 17, 2022
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై మూడున్నరేళ్లు అవుతోంది. వైఎస్ వివేకా సామాన్యుడు కాదు.. ఆషామాషీ వ్యక్తి అసలే కాదు.. ఒక దివంగత సీఎంకు తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా సొంత బాబాయ్. అయినప్పటికీ వివేకా హత్య కేసు కొలిక్కి రాకపోవడం గమనార్హం. అయితే.. వివేకా హత్య కేసు విచారణ ముందుక సాగకపోవడానికి ముఖ్య కారణాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఒక పిటిషన్ ద్వారా స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో నిందితులు,స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, అందువల్లే విచారణ సాఫీగా సాగడం లేదని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.
వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులో సాక్షులకు ప్రాణ భయం ఉంటుందని సీబీఐ పేర్కొనడం గమనార్హం. వివేకా హత్య కేసులో సాక్షులను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గంగిరెడ్డికి నోలీసులు జారీ చేసింది.
సీబీఐ అభియోగాలపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గంగిరెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. కాగా.. నిందితులు- స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, వారు మూకుమ్మడిగా విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఆరోపించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు దోషులెవరో తెలియకపోవడంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్రమంలోనే వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కూడా స్థానికంగా నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారంటూ తీవ్ర అభియోగం మోపడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-25-145597.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్