వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం.!

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం  అయిన పోలవరం ప్రాజెక్టు  వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే   ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన సోమవారం(జులై 13)   పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణ పనులను  ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయికి చేరుకుని స్పిల్‌వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యామ్ పనుల పురోగతిని  పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నూతన కార్యాచరణ, గడువుపై విస్పష్ట ప్రకటన చేశారు. 

aస్పిల్‌వే నిర్మాణంతో పాటు రేడియల్ గేట్లు, ఎగువ,  దిగువ కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేశామని చెప్పారు. గోదావరి నదికి వచ్చే దాదాపు 50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని   తట్టుకునే విధంగా   గేట్లను డిజైన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే..  ఐదేళ్ల  వైసీపీ హయాంలో..  పోలవరం ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము 2019 నాటికి కష్టపడి 72 శాతం మేర పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్..  రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పక్కన పెట్టేసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ  వద్దని వారించినప్పటికీ, మొండిగా టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు.

రూ. 440 కోట్లతో నిర్మించిన అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతిన్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పుడు నూతనంగా దానిని నిర్మించాల్సిన భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. భూసేకరణ,  నిర్వాసితుల పునరావాస ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు దాదాపు 94వేల152 ఎకరాల భూమిని సేకరించినట్లువివరించిన ఆయన  మిగిలిన భూసేకరణ పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి  పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు.  పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే సుమారు 17 వేల 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, మిగిలిన నిర్వాసిత కుటుంబాల తరలింపు, పునరావాస కాలనీల నిర్మాణాన్ని కూడా మార్చి 2027 నాటికి   ముగిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల కోసం ఇప్పటివరకు 17 వేల 118 గృహాల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. 

Polavaram,  dedicated to nation,   March next year, cbn, Polivaram Project, Works

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.