జగన్ సర్కార్ హ్యాండ్సప్! చిక్కుల్లో పోలవరం ప్రాజెక్ట్

Publish Date:Mar 21, 2021

Advertisement

అన్నకున్నట్లే జరుగుతోంది. ప్రజలు భయపడుతున్నట్లే జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ చేతగానితనంలో ఆంధ్రప్రదేశ్ కు మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంది కేంద్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ ప్రజలు భగ్గుమంటున్న సమయంలోనే మరో షాకిచ్చింది మోడీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కోత పెట్టేందుకు సిద్ధమైంది. 

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దంటూ కేంద్ర జల వనరులశాఖకు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు ఆ మొత్తానికే పరిమితం కావాలని తేల్చి చెప్పింది. కేంద్ర జల వనరులశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.55,656.87 కోట్ల తుది అంచనా వ్యయంపై కేంద్రం స్పందించలేదు.

పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు రూ.5,035.05 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.7,278.85 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు రూ.8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువ రూ.1,885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ రూ.2,373.07 కోట్లకే పరిమితం కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించింది. ఈ పద్దులన్నింటిని లెక్కిస్తే రూ.25,390.61 కోట్లుగా ఉంది. ఈ మొత్తం 2014లో రాష్ట్ర విభజనకు ముందు చేసిన వ్యయంగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ పద్దుల మేరకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని పీపీఏకు కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. 

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా కేంద్ర జల సంఘం, రూ.47,725.74 కోట్లుగా తుది అంచనాల సవరణ కమిటీ 2017లో నిర్ధారించాయి. కానీ కేంద్రం మాత్రం వాటిని అధికారికంగా గుర్తించలేదు. తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌లకు సీఎం జగన్‌ పలు దఫాలుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర జలసంఘం అంచనా మేరకు భూ సేకరణ వ్యయం రూ.13,077.15 కోట్లు, పునరావాసానికి ఖర్చు రూ.20,091.09 కోట్లుగా ఉంది.  

కేంద్ర జలశక్తి, కేంద్ర ఆర్థికశాఖతో కూడిన తుది అంచనా వ్యయ కమిటీ భూ సేకరణకు రూ.10,199.67 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.17,972.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం చేస్తున్న ఖర్చులు చెల్లించాలంటూ పీపీఏకు జల వనరుల శాఖ బిల్లులు పంపుతోంది. నెలల తరబడి బిల్లులు ఆమోదించడం లేదు. భూసేకరణ కోసం రూ.487 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే అందులో రూ.400 కోట్లకు ఇటీవల సమ్మతి తెలిపిన పీపీఏ మరో రూ.87 కోట్లకు మాత్రం కొర్రీ వేసింది. దీనికి జల వనరుల శాఖ వివరణలు ఇస్తూనే ఉంది. పోలవరానికి నిధుల విషయంలో కేంద్రం తన వైఖరికే కట్టుబడి ఉండటం రాష్ట్ర జల వనరుల శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.