వెలిగొండ, పొలవరం నీళ్లిస్తే జగన్ ఏడుపెందుకు?
Publish Date:Sep 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులపై ఇటీవల చేసిన ట్వీట్లు, విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తెలుగుదేశం అధికార ప్రతినిథి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పసాని రాజేష్ వివరించారు. కాలువ నిర్మాణంలో అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్, అక్విడెక్ట్‌లు, కల్వర్టులు పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉంటే, నేడు పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అయన చెప్పారు. ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు, వర్షాభావ వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు అందిస్తోందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, కానీ ఆనాటి ఆ నిర్ణయమే నేడు కృష్ణా డెల్టాను కాపాడిందని గుర్తుచేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక వైఎస్ హయాంలో జలయజ్ణం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అప్పసారి రాజేష్ ఖండించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టిపనులు పూర్తి చేసి డబ్బులు దండుకుని చేసింది జలయజ్ణం కాదు, ధనయజ్ణమని విమర్శించారు. [Polavaram Left Canal, Veligonda, Polavaram Left Canal, Chandrababu Naidu Irrigation, Jagan Credit Chori, Purushothapatnam lift irrigation, AP Politics News, Telugu One]
http://www.teluguone.com/news/content/polavaram-left-canal-25-230784.html




