నితి ఆయోగ్ ముందు పోలవరం.. బాబు అజెండా ఇదే!

Publish Date:Jul 26, 2024

Advertisement

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. 

ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు.

పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత  వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.