Publish Date:Jul 26, 2024
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.
ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు.
పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/polavaram-before-niiti-ayog-39-181556.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.