పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజాగావర్గంలో త్రిముఖపోటీ నెలకొంది. ప్రధానపోటీ మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల మధ్య ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తెల్లం రామరాజు, తెలుగుదేశం పార్టీ తరుపున మొడియం శ్రీనివాసు, కాంగ్రెస్ తరుపున నూపా పార్వతి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో లక్షా 72వేల 187మంది ఓటర్లున్నారు. కొత్తగా ఏడు వేల పైచిలుకు ఓట్లు పెరిగాయి. ఈసారి రంగంలో ఉన్న ముగ్గురిలోనూ రామరాజు సీనియర్. తనకున్న అనుభవంతో ఓట్లను మలుచుకోగలరని పరిశీలకులు అంచనా వేశారు. ఈయన తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనల వల్ల నియోజకవర్గంలో ఆ పార్టీకి మద్దతు పెరిగింది. దీంతో అభ్యర్థి మొడియం శ్రీనివాస్ కు రామరాజుతో పోటీపడే అవకాశాలున్నాయి. శ్రీనివాస్ తమ పార్టీ అధినేత పర్యటనలతో పాటు సీనియర్ కార్యకర్తలను సమీకరించుకుని ప్రచారాలు చేస్తున్నారు. ఇది కూడా సత్ఫలితాలు ఇవ్వవచ్చని దేశం ధీమాగా ఉంది. అయితే రాజకీయాలకే కొత్త అయిన నూపా పార్వతికి కాంగ్రెస్ అవకాశమిచ్చింది. అసలు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని ఆమె కాంగ్రెస్ నేతల ప్రచారంపైనా, సీనియర్ కార్యకర్తల సలహాలపైన ఆధారపడ్డారు. దీంతో ఆమెకు విజయావకాశాలు తక్కువని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పేరుకే నియోజకవర్గంలో మూడు ప్రధానపార్టీలు ఉన్నా పోటీ మాత్రం తెలుగుదేశంపార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉంటుందని అంచనా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/polavaram-ap-by-polls-24-14707.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!