పరకాల అసెంబ్లీ నోయోజకవర్గంలో పచ్చనోట్లు రాజకీయాంశమవుతున్నాయి. ప్రచార ఘట్టం చివరికి వచ్చేస్తున్నందున అభ్యర్థులు తమ గెలుపు ఖాయం చేసుకునేందుకు పచ్చనోట్లతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. అయితే విషయం వెలుగులోకి వస్తే మాత్రం ఆ నోట్లకూ తమకూ ఏమాత్రం సంబంధంలేదని చేతులెత్తేస్తున్నారు. తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై ఈ పచ్చనోట్ల పంపిణీ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఆమె కరపత్రంతో పాటు 500రూపాయల నోటు ఓటరుకు ఇచ్చిందని మీడియా కోడైకూసింది. విషయం వెలుగులోకి వచ్చాక ఆమె మీడియా ముందుకువచ్చి తానంటే గిట్టని టి.ఆర్.ఎస్. నేతలే ఇటువంటి తప్పుడుపనులు చేస్తున్నారన్నారు. తాను నోటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అడ్డదారుల్లో గెలవటానికి టి.ఆర్.ఎస్. తాపత్రయపడుతోందని, తానైతే ఒక్క కరపత్రం మాత్రమే ఇచ్చానని అంటున్నారు. 15రోజుల క్రితం కూడా వుద్దురాలిని తాను ఓటడిగితే దాన్ని తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ మాటలు నమ్మొద్దని, ఆమెను అనర్హురాలిగా ఎన్నికల కమీషన్ ప్రకటించాలని టి.ఆర్.ఎస్. కోరుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parakala-by-elections-2012-24-14708.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!