పీవోకేలో భారత్ మాతాకీ జై.!

Publish Date:Aug 17, 2026

Advertisement

భారత్,  పాకిస్తాన్ దేశాలు  తమ 80వ స్వాతంత్య్ర వేడుకలను  ఇటీవలే ఘనంగా జరుపుకున్నాయి. అయితే రెండు దేశాల  వేడుకల్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. భారత్ లో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలలో దేశ భక్తి ఉప్పొంగింది. అదే సమయంలో పాకిస్థాన్ లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడ జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత్ మాతాకీ జై నినానాదాలు మిన్నంటాయి. 

భారతదేశంలో స్వాతంత్య్ర వేడుకలు ఎంతో ప్రశాంతంగా, ప్రజా భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జరిగితే..  సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్తాన్‌కు మాత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవం తీవ్ర పరాభవాన్ని, కలవరాన్ని, అవమానాన్ని మిగిల్చింది.

పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి కేవలం 3 రోజుల ముందు, అంటే ఆగస్టు 11న, ఆ దేశంలోనే అతిపెద్ద భూభాగమైన బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్ర బలూచిస్తాన్‌ను ప్రకటించుకున్నారు.  ఆ తరువాత ఆగస్టు14 స్వాతంత్ర్య వేడుకల్లో  పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకేలో జై భారత్ నినాదాలు మిన్నంటాయి.  దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల వివక్ష, పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలతో విసిగిపోయిన పీవోకే జనం ప్రభంజనంలా రోడ్లపైకి వచ్చారు. పాకిస్తాన్ జెండాలను, అక్కడి సైనిక అధికారులను నిరసిస్తూ పీవోకే వీధుల్లో భారత అనుకూల నినాదాలు హోరెత్తించారు.  

PoK Pro India Slogans, Pakistan Occupied Kashmir Protests, Balochistan Independence, India Independence Day, Kashmir Development, PoK Merger With India

By
en-us Political News

  
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.