పోచారం ఆవేదన వెనుక అసలు రాజకీయం ఇదేనా..?

Publish Date:Aug 12, 2026

Advertisement

 

పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?

తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన, ఇప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి..? అసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో కండువా కప్పిన కీలక నాయకుల్లో పోచారం ఒకరు. 

కానీ, ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల వల్లే కాంగ్రెస్‌లోకి రావలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశమైంది.
అన్నం పెట్టిన నాయకుడిని మరవడం చాలా కష్టంగా ఉందంటూ పోచారం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వెనుక అర్థమేంటి? నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం వల్లే తాను పార్టీ మారానని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

అయితే, ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తాను అసలు కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. డెవలప్‌మెంట్ నిధుల కోసం పార్టీ మారానని చెప్తూనే, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజలను అంత అమాయకులుగా భావిస్తున్నారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా పోచారం బహిర్గతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను సొంత క్యాబినెట్ మంత్రులే అస్సలు లెక్క చేయడం లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనుల కోసం మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు పోచారం మాటల ద్వారా స్పష్టంగా బయటపడింది. అయితే, పోచారం మాత్రమే కాకుండా దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి మరికొందరు నాయకుల వైఖరిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జగిత్యాల ప్రాంతంలో దశాబ్దాలుగా జీవన్ రెడ్డి చెప్పిందే శాసనంగా ఉండేది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, అక్కడ పరిస్థితులు మారాయి. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయం కప్పుకుని మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై విమర్శలు రావడం గమనార్హం. 

కేసీఆర్ గడీలోకి వెళ్లిన వారైనా లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలైన నిబద్ధత కలిగిన నాయకులు ఎవరో, కేవలం ప్రయోజనాల కోసం వచ్చే వారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్ సవాలును తట్టుకోవాలంటే హైకమాండ్ తక్షణమే స్పందించి ఈ ఆధిపత్య పోరుకు, అసమ్మతి వ్యాఖ్యలకు ముగింపు పలకాల్సి ఉంది.

Pocharam Srinivas Reddy,  CM Revanth Reddy Congress Party, Telangana Politics News, KCR BRS, Pocharam Comments, Telangana Congress News

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.