శ్రీశైలంలో మోడీ ప్రత్యేక పూజలు

Publish Date:Oct 16, 2025

Advertisement

 ప్రధాని నరేంద్రమోడీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి శ్రీశైలం ఆలయానికి విచ్చేసిన ఆయనకు   వేద పండితులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు.  మొదటిగా  స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని మోడీ అనంతరం  అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు.  

పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య  మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు  ఆశీర్వాదం అందజేశారు.  అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని  మోడీకి అందించారు. అలాగే  చంద్రబాబు నాయుడు  పవన్ కళ్యాణ్  కూడా  శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు. ఆలయ విశేషాలను తెలిపారు.  ప్రధాని మోడీ దాదాపు గంట సేపు శ్రీశైలం ఆలయంలో గడిపారు.   

అనంతరం శ్రీశైలంలోని  ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్నిమోడీ సందర్శించారు.  కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ  జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూజ చేశారు.  కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.

By
en-us Political News

  
స్వాతంత్ర్యం తర్వాత చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అయితే, విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం, ఆర్థికంగా వెనుకబడిన ఓసీవర్గాలకు అవకాశాల లోపం. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాల కోత, రిజర్వేషన్లు తాత్కాలికం కావాలనే రాజ్యాంగ ఉద్దేశ్యం అమలు కాకపోవడం వంటి సమస్యలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం.
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకుంటూ.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇక అటువంటి వారికి ఆశ్రయమిచ్చే హోటళ్లపై తమ డ్రోన్లు దాడి చేస్తాయని స్పష్టం చేశారు.
Publish Date:Sep 21, 2012

The role or involvement of al Qaeda in the attack

Publish Date:Sep 21, 2012

Nearly two years after President Barack Obama ordered 33,000

సైనా నెహ్వాల్‌ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.