పవన్ కళ్యాణ్ కు మోడీ రోడ్ మ్యాప్.. అదేనా?

Publish Date:Nov 14, 2022

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో రోడ్ మ్యాప్ అడుగుతున్నా మిత్ర పార్టీ బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందన కనిపించేది కాదు. ఇదే విషయాన్ని ఇటీవల జనసేన పార్టీ నేతలు, శ్రేణులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగానే ప్రస్తావించారు. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ విశాఖలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పీఎంఓ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అలాగే.. బీజేపీ కోర్ కమిటీ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కు కేవలం పది నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. అరగంటకు పైగా ఆయనతో మోడీ చర్చలు జరపడం విశేషం. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారనే ఊహాగానాలు వస్తున్నాయి.

ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీలతో కలిపి ఉమ్మడి విపక్షం ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి విపక్షానికి బదులు జనసేన-బీజేపీతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని అంటున్నారు. అందుకేనేమో మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విపక్షం విషయంలో మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఏపీలో తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.

మోడీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా చేసిన చర్చలే ప్రధాని విశాఖపట్నం పర్యటనలో కీలకంగా మారాయంటున్నారు. విశాఖలో తన తొలి రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తర్వాతి రోజు మోడీ టూర్ లో గవర్నర్, సీఎం జగన్ కనిపించారు. విశాఖలో తొలిరోజు పర్యటనను మోడీ రాజకీయ చర్చలతో ప్రారంభించారు. తద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటో మోడీ చెప్పకనే చెప్పారంటున్నారు. రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గడిపారు. అంటే.. ఏపీలో మోడీ పర్యటనలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టం చేశారంటున్నారు.

వైజాగ్ లో తన పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకున్న వైసీపీ సర్కార్ తీరుతో  పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రవేశాలకు గురయ్యారు. విశాఖ నుంచి మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ  నేతలు, మంత్రులకు చెప్పు చూపించి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఏపీలో తీవ్ర సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సభ తరువాత విజయవాడలో బస చేసిన హొటల్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన-బీజేపీలతో బలమైన ఉమ్మడి ప్రతిపక్షం ప్రతిపాదన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్సాహానికి ప్రధాని మోడీ తన రూట్ మ్యాప్ ద్వారా బ్రేక్ వేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీలతో ఏర్పడిన ఉమ్మడి విపక్షం అయితే.. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించవచ్చనే అభిప్రాయాలు  సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ-జనసేన మాత్రమే కలిసి ముందుకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల నాటికి అవసరం, అవకాశాన్ని బట్టి టీడీపీతో పొత్తు విషయం చూద్దామని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే పవన్ కళ్యాణ్ నిరుత్సాహం కలిగిందంటున్నారు. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ నిరుత్సాహమే కనిపించిందంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే  వెళ్లిపోయారంటున్నారు. అందుకే మోడీతో సమావేశం సందర్భంగా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు చెప్పకుండా పవన్ మౌనం వహించారంటున్నారు.

సుమారు ఎనిమిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ అవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తించబోమని చెబుతున్న వైసీపీ సర్కార్ కు పవన్ కు అంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మోడీ గట్టి ఝలక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.