పంజాబ్ లో ఇదే జరిగింది.. రాష్ట్రపతికి వివరించిన ప్రధాని 

Publish Date:Jan 6, 2022

Advertisement

ప్రధాన మంత్రి నరేందర్ మోడీ పంజాబ్ పర్యటనలో  చోటు చేసుకున్న భద్రతా లోపాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన, రాజకీయ చర్చ జరుగతున్న నేపధ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రదాన మంత్రి పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పంజాబ్ సంఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

పంజాబ్‌ పర్యటనకు బుధవారం వెళ్లిన మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ఆకస్మికంగా ర్యాలీని రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తటంపై  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై పఠిష్ఠ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. 

ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపాల వ్యవహరం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ప్రధాని పర్యటనల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా.. పిటిషన్ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

మరోవంక ప్రధాని నరేంద్రమోదీ ఫిరోజ్‌పుర్‌ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మెహ్‌తాబ్‌, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనురాగ్‌వర్మ ఈ దర్యాప్తు బృందంలో ఉన్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కమిటీ 3రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు అశ్వినీ శర్మ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆరోపించారు. అశ్వినీ శర్మ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బీజేపీ  బృందం ప్రధాని మోడీ పర్యటనలో భద్రతాలోపాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది రాజ్భవన్కు వెళ్లి వినతిపత్రం సమర్పించింది.ప్రధానమంత్రి భద్రత విషయంపై వివాదం చెలరేగటం చాలా దురదృష్టకరమన్నారు మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవే గౌడ. దేశ అత్యున్నత వ్యక్తుల భద్రత అంశంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అంశాల నుంచి నేర్చుకోవాలని సూచించారు.

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.