ప్రతి పాఠశాలలోనూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం.!

Publish Date:Aug 9, 2026

Advertisement

విద్యార్థులు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాలను సందర్శించడం వల్ల, వారిలో కళాత్మక వస్తువుల పట్ల మక్కువ పెరగటంతో పాటు కొత్త ఆవిష్కరణకు దారితీస్తుందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్  ఈమని శివనాగిరెడ్డి అన్నారు.  స్థానిక లైబ్రరీ మరియు స్టిక్లీ మ్యూజియం నిర్వాహకుల సమన్వయం మేరకు ఆయన   న్యూజెర్సీ మోరిస్ ప్లెయిన్స్, స్టేట్ రూట్ 10, క్రాఫ్ట్మన్ లోని దీ స్టిక్లీ మ్యూజియాన్ని సందర్శించారు.

జర్మన్ మూలాలు గల, అమెరికా నివాసి, డిజైనర్, వాస్తు శిల్పి, కళాత్మక ఫర్నిచర్ రూపశిల్పి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఉద్యమ అధికార ప్రతినిధిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గుస్తావ్ స్టిక్లీ  1898- 1917 మధ్య రూపొందించిన కళాత్మక వస్తువుల ప్రదర్శనశాల, పర్యావరణహిత కళారూపాలకు, ఆయన ప్రతిభకు అద్దం పడుతున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.

 ప్రదర్శనశాలతో పాటు తన నివాసంగా కూడా ఉపయోగించిన రెండంతస్తుల భవనంలోని ప్రతిగదీ ఆయన ఆలోచనలకు ప్రతిరూపాలని, అపురూపమైన వారసత్వ కట్టడాన్ని స్థానిక లైబ్రరీ ద్వారా విద్యార్థులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారని.. , నిపుణులైన గైడ్లు వారికి అవగాహన కల్పించడమే కాక, కళాత్మక వస్తువుల తయారీకి ప్రోత్సహించటం ఆకట్టుకుందని శివనాగిరెడ్డి చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లోనూ విధిగా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియాలను ఏర్పాటు చేసి, స్థానిక కళాకృతులు ప్రదర్శించి, కళాకారులతో శిక్షణనిస్తే, విద్యార్థుల్లో సృజనాత్మక పెరగడమే కాక, మరుగున పడిపోతున్న తెలుగు కళాకృతులకు జీవనాన్ని ఇచ్చినట్లు అవుతుందని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులకు, విద్యారంగ స్వచ్ఛంద సంస్థలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు వెంకట్ బాపతు, విద్యార్థులు సిద్ధార్థ , సితార, ఇంకా విదేశీ కళాభిమానులు పాల్గొన్నారు.

Pleach India Foundation, Ceo, Crafts, Miseum, Schools

By
en-us Political News

  
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పాతబస్తీలో ఘనంగా బోనాల పండుగ శోభ..!
ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై అసదుద్దీన్ విమర్శలు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల వివాదం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.