పార్టీ ఏర్పాటుపై పీకే యూటర్న్.. ఏపీలో వ్యూహకర్తను దూరం పెట్టిన జగన్

Publish Date:May 5, 2022

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏర్పాటుపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతానికి పాదయాత్రతోనే సరిపెట్టేయనున్నారు. స్వయంగా ఆయనే మర్మగర్భంగా చేసిన ట్వీట్ తో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఇన్ని రోజులూ వాటినై స్పందించని పీకే ఇప్పుడు పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇచ్చేశారు. పాట్నాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇస్తూనే.. తన భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున చంపారన్ లోని గాంధీ ఆశ్రమ్  నుంచి పాదయాత్ర  ప్రారంభించనున్నట్లు ప్రారంభించారు. దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో అందరి సమస్యలూ తెలుసుకుంటానని చెప్పారు. అసలు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వేత్తగా మారాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతో బీజేపీ కన్నెర్రకు గురి కావలసి వస్తుందన్న బెదురుతో జగన్ పీకేను దూరం పెట్టారు. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున పీకే పని చేసే అవకాశాలు దాదాపు మృగ్యమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. 

కాంగ్రెస్ లో చేరి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చక్రం తిప్పాలన్న పీకే వ్యూహం కూడా బెడిసి కొట్టింది. పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ సోనియా పీకే కండీషన్స్ ను ఒప్పుకోకపోవడం వల్లనే పీకే హస్తానికి దూరంగా ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంత వరకూ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పయనం చూస్తే.. ఒక సారి పని చేసిన పార్టీకి ఆయన రెండో సారి పని చేసిన దాఖలాలు కనిపించవు. ఆయన పని చేయలేదనడం కంటే పార్టీలే ఆయనను దూరం పెట్టాయనడం కరెక్టుగా ఉంటుంది. గుజరాత్ లో బీజేపీని గెలిపించడానికి తన వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అయిన పీకే.. ఆ జోరుతో ఎన్డీయేకు వ్యూహకర్తగా 2014లో పని చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఆయితే ఆ తరువాత బీజేపీ పీకేను దూరం పెట్టింది. తరువాత పీకే జేడీయూలో చేరారు. బీహార్ లో జేడీయూ అధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరడంతో ఆ పార్టీ నుంచి  పీకే బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి వ్యూహకర్తగా మరి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించి సఫలం అయ్యారు. ఇప్పుడు కారణాలేమైతేనేం జగన్ కూడా పీకేను దూరం పెట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికల వ్యూహకర్తగానే కాకుండా పార్టీపై ఆధిపత్యం చెలాయించే పీకే ధోరణి కారణంగానే పార్టీలు ఆయనను దూరంపెడుతుంటాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే  సార్వత్రిక ఎన్నికల నాటికి పీకే సొంత పార్టీ పెట్టక, వ్యూహాలు తీసుకోవడానికి పార్టీలూ ముందుకు రాక ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.