ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్ పై పీకే సర్వే ఏమి చేబుతోందంటే?

Publish Date:Jan 10, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ జాతకాలు నమ్ముతారు. వాస్తును విశ్వశిస్తారు. ఇక,యజ్ఞయాగాదుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవెక్కడి మూఢ నమ్మకాలని ఎవరైనా తూల నాడినా ఆయన పట్టించుకోరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇమాంలు మంత్రించి ఇచ్చిన ఆకుపచ్చ చేతి పట్టి మరిచి పోరు. ఇలాంటి నమ్మకాలు  ఆయనకు ఇంకా చాలానే ఉన్నాయని అంటారు. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తల సైంటిఫిక్  సర్వేలను, కంప్యూటర్ వ్యూహాలను కూడా కేసీఆర్ అంతగా విశ్వశిస్తారు. రిలీజియస్ గా భక్తిగా ఫాలో అవుతారు. అందుకే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదుల నిర్వహించడంతో పాటుగా సర్వేలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  

కాగా, ఇప్పడు కేసీఆర్ ... భారత రాష్ట్ర్ర సమితి విస్తరణలో భాగంగా, ఏపీలో మొదటి అడుగు వేశారు. తెలంగాణ వెలుపల, తెలంగాణ కంటే ముందుగా ఏపీలో పార్టీ నియామకాలు మొదలుపెట్టారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా  జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను నిమించారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ముఖ్యనాయకులు, మరి కొందరు వారి అనుచరులు మందీ మార్బలంతో పనిగట్టుకుని మరీ హైదరాబాద్  వచ్చి పార్టీలో చేరారు. అయితే, తెలగాణ వెలుపల వేసిన తొలి అడుగు ఏమిటి  ఎలా పనిచేస్తుంది పొరుగు రాష్ట్రంలో తెలంగాణ నాయకుడి పార్టీకి  ఎంతవరకు ప్రజాదరణ లభిస్తుంది అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొంత కాలం భారాస (అప్పట్లో తెరాస) ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్తో ఫ్రెష్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్  మీద  సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయడంవల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ సీట్లు కానీ, లోక్ సభ సీట్లు కానీ గెలవడానికి అవకాశాలున్నాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కేసీఆర్ చేస్తున్న పోరాటం గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీ పాలనకు, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను గమనించారా? ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు? బీఆర్ఎస్ విస్తరణను స్వాగతిస్తారా? తదితర విషయాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు విస్వసనీయంగా తెలుస్తోంది. 

అంతే కాకుండా ఏపీలో పోటీకి అనుకూల నియోజక వర్గాలను గుర్తించే బాధ్యతను కూడా కేసేఆర్ ఐ ప్యాక్  బృందానికే అప్పగించినట్లు చెపుతున్నారు. అలాగే  నేరుగా పొరుగు రాష్ట్త్రాల నట్టింటి నుంచి కాకుండా, తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ గురి పెట్టారని అంటున్నారు. అందు కోసమే, ఢిల్లీ లేదా యూపీలో అనకున్న బీఆర్ఎస్ అవిర్భావ సభను, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు జిల్లా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. అలాగే  ఎపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడంకన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీచేసి విజయావకాశాలను పెంచుకోవాలని కేసేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే ఆలోచనతో అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే, ఎపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలలోనూ పరిమిత సీట్లలో పోటీచేసే అలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిలో అడుగు పెట్టే ముందు. బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోవడంకన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయంగా ప్రయోజనం సిద్ధిస్తుందని బీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా  గుర్తింపు పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించి, ఆపైన  ఉత్తరాదిఫై దృష్టి కేద్రీకరించాలని కేసీఆర్ తాజా వ్యూహంగా చెపుతున్నారు. 

కాగా  ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన - 1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. ఇందులో మొదటి నిబందన కష్టం కాదు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరి కొన్ని రాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీకి నిలుపుతుంది. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ఇక ఆరు శాతం ఓట్లు, నలుగురు ఎంపీ నిబంధనపైనే కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారని, అందులో భాగంగానే పార్టీ విస్తరణ కార్యక్రమానికి ఏపీలో సర్వేతో  శ్రీకారం చుట్టారని అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.