పీకే ప్యాకప్.. కేసీఆర్‌తో నో డీల్‌.. అందుకేనా?

Publish Date:Mar 19, 2022

Advertisement

ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్’తో మంతానాలు జరిపారు. అంతకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్’తో చర్చలు సంప్రదింపులు సాగించారు. సలాహాలు ఇస్తూనే ఉన్నారు,  సూచనలు చేస్తూనే ఉన్నారు.  ఫైనల్’గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస’ను మళ్ళీ గెలిపించే బాధ్యతను పీకే తీసుకున్నారు. డీల్ సెటిల్ అయింది. కొంత మంది ఇన్నికోట్లు అంటే, కొందరేమో అన్ని కోట్లు అంటున్నారు. రేటు ఎంతైనా డీల్ అయితే కుదిరింది.

పీకే, నటుడు కేసీఆర్ అనధికార వ్యూహకర్త  ప్రకాష్’ రాజ్ తోకలిసి మల్లన్నసాగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.అధికారులు వెంట వుండి, మర్యాదలు చేశారు. సో.. ఎలాంటి అనుమానం లేకుండా పీకే’తో కేసీఆర్ డీల్ ఫైనలైజ్’ అయిందని అందరికీ అర్థమైంది. అధికార తెరాస నాయకులు టీవీ చర్చల్లో ఇతరత్రా కూడా, డీల్ కుదిరిందని, పీకే బృందం రంగంలోకి దిగిందని,దిగుతుందని చెప్పు కొచ్చారు. అలాగే, పీకే స్క్రిప్ట్’లో భాగంగానే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం స్క్రిప్ చేయడం, ముఖ్యమంత్రి అసుపత్రి సీన్’వంటి కొన్ని సంకేతాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్న ప్రచారం జరిగింది. 

అయితే, ఇదంతా అయిన తర్వాత. రెండు మూడు రోజుల క్రితం, పీకే ఒక నేషనల్ న్యూస్ ఛానల్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో పీకే, తెరాసతో తాను ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పుకొచ్చారు. తెరాసతో డీల్ లేకుండానే, పీకే బృందం తెలంగాణలో పనిచేస్తోందా, అంటే పీకే ఐపాక్’ బృందంతో  తనకు  సంబంధం లేదని అన్నారు. అయితే, ఐప్యాక్’కు పీకేకి సంబంధం లేదంటే, నమ్మే పరిస్థితి లేదని వేరే చెప్పనక్కరలేదు. అయితే, పీకే ముందు డీల్ కుదుర్చుకున్నా, సర్వే రిపోర్ట్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ‘మిడిల్ డ్రాప్’ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.అందుకే ఆయన నేషనల్ ఛానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ’లో కేసీఆర్’తో తెరాసతో డీల్ లేదని ప్రకటించారని క్లోజ్ సర్కిల్స్ ‘సమాచారం.

సహజంగా, పీకే ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన గెలిచే పక్షంతో డీల్ చేసుకుని, గెలుపు క్రెడిట్’ను సొంతం చేసుకోవడమే కాని, ఓడిపోయే పార్టీని గెలిపించిన దాఖాలాలు లేవని, పరిశీలకులు అంటారు. అందుకే ఆయన యూపీలో కాంగ్రెస్ డీల్ తిరస్కరించారని, అదే విధంగా గోవాలో తృణమూల్’తో ఒప్పందం రద్దు చేసుకున్నారని, అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో తెరాస ఓటమి పక్కా అనే నిర్ణయానికి వచ్చే, డీలే లేదని అంటున్నారని, అంటున్నారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని భావించి తెరాసతో తెగ తెంపులు చేసుకున్నారని అంటున్నారు. అయితే, పీకేని నమ్మేందుకు లేదని, ఆయనకు నీతి, నిజాయితీ, నిజమే చెప్పాలనే నియమాలు ఏవీ ఉండవని, కాబట్టి ఆయన ఏదీ చెప్పిన నమ్మలేమనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే, పీకే వ్యవహారం ఎలా ఉన్నా, ఎన్నికలు ఇప్పుడు వచ్చినా, ఇంకెప్పుడు వచ్చిన, తెరాస ఓటమి ఖాయమని, అన్ని సర్వేలు సూచిస్తున్నాయి.  చివరకు కేసీఆర్ చేయించుకున్న  సొంత సర్వేలలో కూడా,, ఎండ్ రిజల్ట్, ‘ప్యాకప్’ అనే వస్తోందనేది మాత్రం నిజం, అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.