దటీజ్ పిఠాపురం వర్మ!

Publish Date:Mar 17, 2025

Advertisement

పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ  చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. 

గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్పీఎస్ఎస్ వర్మకు అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అయినా వర్మలో ఎక్కడా అసంతృప్తి కానీ, అసహనం కానీ కనిపించలేదు.  మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంత కాలం కిందట పిఠాపురంలో పర్యటించిన జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం జనసేన ఇన్ చార్జ్ కి మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ వర్మకు కాదన్నది ఆ ఆదేశాల సారాంశం.  

ఇక తాజాగా పిఠాపురం వర్మకు తెలుగుదేశం ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్నది స్వయంగా జనసేనానే అని అంటున్నారు.  పిఠాపురంలో ఎమ్మెల్సీ వర్మ మరొక అధికార కేంద్రంగా మారతారన్న భయంతోనే.. పవన్ కల్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకుండా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అక్కడితో ఆగకుండా.. తాజాగా జనసేన 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరిగిన సభలో వర్మ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావిం చకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి   విజయానికి  పవన్ కళ్యాణ్, జనసేన క్యాడర్,  పిఠాపురం ప్రజలు మాత్రమే కారణం.. అలాకాకుండా  పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా ఊహించుకుంటే, అది వారి కర్మ” అని  చేసిన వ్యాఖ్యల తరువాత కూడా వర్మ సంయమనాన్ని పాటిస్తూ, తన సహచరులను, పార్టీ క్యాడర్ ను కూడా పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అననీయకుండా నియంత్రిస్తున్నారు.

తాజాగా మంగళవారం (మార్చి 17) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక పోస్టర్ లో కూడా చంద్రబాబునాయుడి పక్కన పవన్ కల్యాణ్ పొటోను ఉంచారు.  ఈ పోస్టర్ ను చూసిన వారంతా దటీజ్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో వర్మ తన ప్రవర్తన ద్వారా రుజువు చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.