పిఠాపురం వర్మకు ఉద్వాసన.. హైకమాండ్ ఆలోచన ఏంటి?

Publish Date:May 8, 2026

Advertisement

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది.  పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో..  ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ   తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి..  క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం  మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.  వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ  అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది. 

గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన,  టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో   వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ..  ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను  నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.  

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.