పైలట్ స్మిత్ మచ్చర్‌ వీరోచిత పోరాటం: 174 మంది ప్రాణాలు కాపాడిన పైలట్‌కు అరుదైన అవార్డు.!

Publish Date:Oct 1, 2026

Advertisement

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన విశిష్ట గుజరాత్ గరిమా అవార్డును అందించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు.
దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. కాక్‌పిట్‌లో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై క్రాష్ యాక్స్ వంటి వస్తువుతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచ్చర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.

అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగింది. దాదాపు 17 వేల అడుగుల ఎత్తును కేవలం ఒక్క నిమిషంలోనే కోల్పోయినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాలు వెల్లడించాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినప్పటికీ.. స్మిత్ మచ్చర్ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్‌ తలుపు తెరిచేందుకు ఆయన ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు. అనంతరం కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి అత్యవసరంగా సురక్షిత ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. స్మిత్ మచ్చర్ అసాధారణమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైతం స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు. 

ఆయన చర్యల వల్ల భారీ విషాదం తప్పిందని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌కు తొలుత సౌదీ అరేబియాలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.స్మిత్ మచ్చర్ తెగువను గుర్తించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ఆయన్ను ‘గుజరాతీ వీరపుత్రుడుగా అభివర్ణించారు. రక్తమోడుతున్న పరిస్థితుల్లోనూ 174 మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు.గాల్లో ప్రాణాపాయం.. కళ్లముందు 174 మంది ప్రాణాలు.. ఒంటిపై తీవ్ర గాయాలు.. అయినా విమానాన్ని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

 

 

 

 

[ Pilot Smit Machchhar, Flydubai hero pilot, Gujarat Garima Award, Bhupendra Patel, Flydubai emergency landing,Heroic Indian pilot, Flydubai pilot attack, Indian pilot bravery, Dubai Tel Aviv flight incident, PM Modi supports pilot family ]


 

By
en-us Political News

  
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.