Publish Date:Jun 27, 2022
ఒకే కుటుంబంలా వున్నవాళ్లు విడిపోకూడదు. అయినా విడిపోతే వారి దారిలో వారు వుండాలి. ఇది మామూలు ఇంటి గొడవలయితే అలానే వుంటారు. కానీ రాజకీయాల్లో అది అంత సులభం కానేకాదు. అందునా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు తలెత్తిన సంక్షోభ సమయంలో అసలుకే కుదరదు. థాక్రే పాలనా విధానం బాగోలేదనే షిండే బయటపడి, మరికొందరిని తనవేపు తిప్పుకుని తిరుగుబాటు ప్రక టించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రంలో, పార్టీలో నానా గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం లో ఇలా గందరగోళం సృష్టించి పాలనకు అడ్డుపడిన రెబెల్స్ మీద ఆగ్రహించి జస్ట్ ఏడుగురు పౌరులు ముంబై హైకోర్టులో పిల్ వేసేరు.
ఏదో అలిగి వెళ్లవచ్చుగాని ఇలా రాష్ట్రపరిస్థితులు, ప్రభుత్వం నడవ కుండా చేయడం మంచిదికాదని, థాక్రేతో సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని మళ్లీ అన్న దమ్ముల్లా కలిసిపోవాలని, తిరిగి వచ్చి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కోర్టు ద్వారా ఆ ఏడు గురు తమ పిల్ లో కోరారు. ప్రజలు ఇంత అమాయకంగానే వుంటారు. ఎక్కడయినా. కానీ అధికారం లో వున్నవారు, తిరుగుబాటు బావుటా ఎత్తినవారు అంత అమాయ కులు కాదన్నది ఈసరికే మరాఠా వారికి తెలిసే వుండాలి. అయినా ఏదో మనోళ్లు మన మాట ఇనకపోతారా అన్న అభిప్రాయంతో పిల్ వేసి వుంటా రనే అనుకోవాలి.
సమాజ సేవలో తరించాల్సినవారు ఈ విధంగా రాజ్యధికారం కోసం విభేదించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దూరంగావడం, సంక్షోభం సృష్టించడం స్వార్ధప్రయోజనమే అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్రస్తుతం అనేకమంది మంత్రులు విడిపోవడంతో శివసేన నాయకత్వంలోని ఎం.వి.ఏ ప్రభు త్వం ఏ విధంగా సవ్యంగా పాలన సాగిస్తుందో, అందుకు ఎలాంటి వ్యూహాలు వున్నదీ స్పష్టం చేయా లని పిటిషన్‌లో ప్రశ్నించారు.
ఏక్‌నాథ్ షిండే గత వారం రోజులుగా శివసేనా ప్రభుత్వానికి ఎదురుతిరిగిన ఇతర రెబెలియన్స్‌తో గౌహతీ లో వున్నారు. వీరే కాదు మరో 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా వుందని, మరీ ముఖ్యంగా వారిలో 40 మంది శివసేనవారే వారే వున్నారని షిండే ధీమా వ్యక్తంచేశారు. కాగా తనను తనతో పాటు మరో 15 మంది ఇతర రెబెల్ లెజిస్లేటర్లపై అనర్హత వేటు వేస్తూ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసు ఇవ్వడం పై షిండే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిప్యూటీ స్పీకర్ నోటీసు అనైతికమని, రాజ్యాంగ వ్యతిరేకమని షిండే ఆరోపించారు.
బావ కొంపకూల్చి ఆయన తమ్ముడిని బాగున్నారా అని అడిగిందట వెనకటి ఒకామె. అలానే వుంది షిండే వ్యవహారం. ఆదివారం షిండే ఉద్ధవ్ థాక్రే సమీప బంధువు రాజ్ థాక్రేతో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడారని మహా రాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎం ఎన్ ఎస్) పార్టీ నాయకుడు ఒకరు తెలియజేశారు. ప్రస్తుత మహారాష్ట్ర రాజ కీయ పరిస్థితులు ఎలా వున్నాయి, రాజ్ ఆరోగ్యం ఎలా వుందని అడిగి తెలుసుకున్నారట. ఎం ఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఆదివారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సంగతి తెలిసి షిండే ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగినట్టు వార్త. శివసేన నుంచి 2006లో విడిపోయిన రాజ్ ఎంఎన్ ఎస్ పేర సొంత దుకాణం పెట్టారు. కాగా శివసేన కి చెందిన 38 ఎమ్మల్యేల మద్దతు తనకు వుందని అసెం బ్లీలో అసలు సేన గ్రూప్‌గా గెలవడానికి వారి మద్దతు సరిపోతుందని షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pil-againest-maha-rebels-39-138542.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.