Publish Date:Oct 16, 2025
ప్రధాని నరేంద్రమోడీ ఏపీ పర్యటనలో ఆయన శ్రీశైలం సందర్శన హైలైట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సంప్రదాయ దుస్తులను ధరించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముగ్గురుకి ముగ్గరూ నిలువెత్తు తెలుగుతనాన్ని ప్రతిబించించేలా ఉన్నారని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీనికి ఫైనల్ టచ్ అన్నట్లుగా ప్రధాని తన శ్రీశైలం ఆలయ సందర్శనపై అచ్చ తెలుగులో చేసిన ట్వీట్ మరింత పాపులర్ అయ్యింది. ‘నా తోటి భారతీయుల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను, అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకున్నా’నని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొత్తం మీద సంప్రదాయ దుస్తులతో ఉన్న మోడీ, బాబు, పవన్ ల ఫొటోను పిక్చర్ ఆఫ్ ది డే అంటూ నెటిజనులు షేర్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/picture-of-the-day-36-208055.html
పశ్చిమ బెంగాల్ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.