Publish Date:Jul 29, 2022
కాసినో స్కాం సూత్రధారి చీకోటి ప్రవీణ్ కారులో చినజీయర్ స్వామా? అవును ఇప్పుడు ఈ వార్తే, ఇందుకు సంబంధించిన ఫొటోలే సంచలనంగా మారాయి. చీకోటి కారులో కూర్చున్న చినజీయర్ స్వామిగారి ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒకప్పటి ఆధ్యాత్మిక గురువు, ఏపీ సీఎం జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించిన స్వామి త్రిదండి చినజీయర్ స్వామి చీకోటి కారులో షికారు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గతంలో త్రిదండి చినజీయర్ స్వామిని చీకోటి తన కారులో కూర్చోబెట్టుకుని తిప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలే చినజీయర్ స్వామిని మరింత ‘పాపులర్’ చేసేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యమా బిజీగా ఉండే స్వామివారు కాసినో నిర్వాహకుడి కారులో ఎక్కి షికార్లు చేయడమేమిటని నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తున్నారు. అత్యంత నిష్టాగరిష్టుడు, ఎందరో బడా బడా రాజకీయ నాయకులకు ఆధ్మాత్మిక గురువు, సమతామూర్తి విగ్రహివిష్కరణకు ఏకంగా ప్రధానిని రప్పించిన క్రేజీ స్వామి వారు.. ఒక కాసినో నిర్వాహకుడి కారులో తిరగడమేమిటి? అన్నది నెటిజన్ల సందేహం.
అసలు త్రిదండి చినజీయర్ స్వామి వారి దర్శనం దొరకడమే సామాన్యులకు దుర్లభం. ఆయనపై పరమ భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన వారు కూడా ఆయనను అల్లంత దూరం నుంచి చూసి దణ్ణం పెట్టుకుని వెళ్లాల్సిందే. అసలు సామాన్యులకు స్వామి వారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. మామూలు భక్తులు అల్లంత దూరం నుంచి స్వామివారిని మొక్కవలసిందే.అలాంటిది చీకోటి కారులో చీకోటి పక్కన కూర్చుని మరీ షికార్లు చేశారేమిటి చినజీయర్ స్వామివారు... వారికి చీకోటితో ఎలా పరిచయం, ఎలాంటి పరిచయం అంటూ నెటిజన్లు తమ సందేహాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇక్కడే వారు చినజీయర్ స్వామి జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడాన్ని గుర్తు చేస్తూ.. గుడివాడ కాసినోకు, చిన జీయర్ స్వామి జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడానికి, చీకోటి కారులో స్వామి వారి షికార్లకు ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలకూ, ప్రశ్నలకూ సమాధానం చెప్పేంత తీరిక స్వామి వారికి ఉంటుందా మరి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/photoos-of-chnajeeyar-swamy-in-shikoti-cae-goes-viral-39-140857.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.