Publish Date:Jan 17, 2023
ఫొటోల పిచ్చి ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. వందేభారత్ రైలులో తలుపులు మన ఇష్టం వచ్చినప్పుడు తీయడానికి, మూయడానికి అవకాశం ఉండని సంగతి తెలిసిందే కదా? అయితే ఆ విషయాన్ని మరచిపోయిన ఓ వ్యక్తి రాజమండ్రిలో వందే భారత్ రైలు ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. జనం అది ఆగే స్టేషన్లకు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే రాజమండ్రీలో రైలు చూసేందుకు వచ్చిన వ్యక్తి ఆగి ఉన్న రైలే కదా అని లోపలికి ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. అనుకున్నదే తడవు రైలెక్కేశాడు. ఫొటోల హడావుడిలో ఉండగానే రైలు డోర్లు మూసుకున్నాయి.
ఆ డోర్ల ఆపరేటింగ్ అంతా రైలు డ్రైవర్ చేతిలో ఉంటుంది. రైలు ప్లాట్ ఫాం మీద ఆగినప్పుడు వాటిని తెరవడం, రైలు బయలుదేరే ముందు వాటిని మూసి వేయడం అంతా డ్రైవర్ చేతిలో ఉంటుంది. అంటే అందుకు సంబంధించి బటన్ లోకో పైలట్ వద్ద ఉంటుంది.
ఆ విషయం తెలియని మనోడు పాపం రైలు కదులుతుండగా దిగేద్దామనుకున్నాడు. తీరా రైలు బయలుదేరడం గమనించి బయటకు వచ్చేద్దామనుకునే సరికి రైలు డోర్లు మూసుకుపోయాయి. అవి మళ్లీ తెరుకుకునేది విజయవాడ స్టేషన్ లోనే. దీంతో ఆ ఫోటోల పిచ్చి యువకుడు విజయవాడ వరకూ రైలులోనే ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి ఫొటోల పిచ్చి ఉన్న వారు వందేభారత్ రైలెక్కి ఫొటోలు తీసుకునే విషయంలో కొంచం ముందు వెనుకలు ఆలోచించాలి మరి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/photo-mania-man-struck-in-vande-bharat-rail-25-150098.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.