OU: పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య..బ్యాట్‌తో కొట్టి చంపిన దుండగులు.!
Publish Date:Oct 1, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కారులో ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు బ్యాట్‌తో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతడిని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? అనే ప్రశ్నలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతుడిని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న వెంకట్‌గా గుర్తించారు. వెంకట్ ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు వెంకట్ కుటుంబ సభ్యులకు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసినట్లు వెంకట్ కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. తనకు ఏదో ఎవరో తనను చంపేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అయితే మరికాసేపట్లో ఇంటికి వచ్చేస్తానంటూ కుటుంబ సభ్యులకు వెంకట్ చెప్పాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు వెంకట్ అని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులకు విషాద వార్త తెలిసింది. వెంకట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి నియోపోలిస్ వద్ద కారును ఆపి వెంకట్‌పై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట్ ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరితోనైనా ఆర్థిక వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు అసలు కారణం ఏమిటి? వెంకట్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? హత్య వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలతో పాటు వెంకట్ ఫోన్ కాల్స్, పరిచయాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. [ PhD student murder, Narsingi crime news, CM Ranga Reddy, cricket bat attack, Telangana latest news, student killed in Hyderabad, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/phd-student-murder-25-233135.html





