Publish Date:May 15, 2026
పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపు శుక్రవారం (మే 15) ఉదయం నుంచీ అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77, డీజిల్ రూ. 90.67, ముంబైలో పెట్రోల్ రూ. 106.68, డీజిల్ రూ. 93.14, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 108.74, డీజిల్ రూ. 95.13, చెన్నై పెట్రోల్ రూ. 103.67, డీజిల్ రూ. 95.25కి చేరాయి.
ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లు దాటడంతో.. దేశీయంగా ధరలను పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. కాగా ఈ పెంపు వల్ల రానున్న రోజులలో రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/petro-36-219831.html
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ సీఎన్‌బీసీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే తమ అంతిమ వ్యూహమని.. ప్రస్తుత చర్చలు అమెరికాకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.