పవన్ పై పర్సనల్ అటాక్ .. లీగల్ యాక్షన్ కు జనసేన రెడీ

Publish Date:Jul 7, 2023

Advertisement

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఆయన క్రేజ్ పెరిగింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పవన్ ఎండగడుతూ వారాహీ యాత్ర కొనసాగగా.. వైసీపీ ఉక్కిరి బిక్కిరై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని స్థితిలోవైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం మొదలు పెట్టారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే స్కూల్ పిల్లల ముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన లేవనెత్తగా.. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే బాటలో పవన్ పై వ్యక్తిగత దాడి మొదలు పెట్టారు. అది మరీ శృతి మించి పవన్ ఇప్పుడు మరోసారి భార్యకు దూరంగా ఉంటున్నాడని.. ఈమెకు కూడా విడాకులు ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దాడికి దిగిన వారిపై ఇప్పుడు జనసేన చర్యలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారంపై, జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.. చిందిస్తోంది. వారిపై లీగల్ యాక్షన్ తీసుకొనేందుకు సైతం సిద్ధమైంది. పవన్ వ్యక్తిగత జీవితంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వైసీపీ నేతలపై జనసేన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. వైసీపీకి చెందిన నాయకుల సోషల్ మీడియా అకౌంట్లు, దుష్ప్రచారం చేస్తున్న కార్యకర్తలతోపాటు, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛాన్సల్, పలు మీడియా సంస్థలపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనసేన  ప్రకటించింది. 

జనసేన  లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరుతో జనసేన పార్టీ విడుదల చేసిన   ప్రెస్ నోట్ లో ఏఏ ఛానెల్స్, ఏఏ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా చర్యలు తీసుకోబోతుందో ప్రకటించింది. ఈ లిస్టులో ప్రముఖ వెబ్ పోర్టల్స్ ఉన్నాయి.  వైసీపీ నేతల విషయానికి వస్తే ఆ పార్టీ అధికార ప్రతినిథి నాగార్జున యాదవ్,  వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న అనితా రెడ్డి తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. ఏపీ పారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ డైరెక్టర్, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి దేవేంద్ర రెడ్డి, గుర్రంపాటి తదితరులకు కూడా లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు జనసేన ప్రకటన ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారంటూ మొదలు పెట్టిన ఈ ప్రచారానికి, వైసీపీ మద్దతుదారులు, వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ తీవ్రంగా ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ అసత్య ప్రచార  దాడి శృతి మించి కొనసాగుతుండటం,   ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులతో ఒకరకంగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండటంతో  ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న జనసేన ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, నేర పూరిత కుట్ర.. తదితర సెక్షన్ల కింద చట్ట పరమైన చర్యలకు సంసిద్ధమవుతోంది.

అయితే, అధికార పార్టీపై లీగల్ యాక్షన్ కి సిద్దమవుతున్న జనసేన ఈ అంశంలో ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నదో తెలియదు కానీ.. సోషల్ మీడియా కట్టడికి మన దగ్గర స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఈ క్రమంలో వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న వైసీపీపై న్యాయపోరాటం అంటే అంత సులభం కాదు. మరి జనసేన ధీమా ఏంటో చూడాల్సి ఉంది. కాగా, ఒకసారి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత సదరు సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లకు ఇబ్బందులు తప్పదు. మరి వైసీపీ అనుకూల వర్గం ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడతారన్నది కూడా చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.