మావోయిస్టు ఉద్యమానికి మరో పెద దెబ్బ తగిలింది. మావోయిస్టు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో సహా మరో 30 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఈ లొంగుబాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడో రేపో వెలువడనుందని పోలీసువర్గాలు తెలిపాయి.
మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గతంలో పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్‌గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.
అయితే కొద్దిరోజుల క్రితమే కమాండర్ దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవ డంతో.. బెటాలియన్ బాధ్యతలు సోది కేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సోది కేశాలు కూడా లొంగుబాట పట్టారు. సోది కేశాలు, మరో 30 మంది మావోయిస్టులు చత్తిస్ ఘడ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం నుంచి తెలంగాణలోకి ప్రవేశించి.. ములుగు, భూపాలపల్లి మార్గంగా వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయారు.
వీరందరినీ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య హైదరాబాదు కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు ఏకే–47లు, ఎస్‌ఎల్‌ఆర్‌లు సహా సుమారు 40 నుంచి 50 వరకు ఆధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ లొంగుబాటు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు దళాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peoples-liberation-army-deputy-commander-surrender-36-216742.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే