యువగళంతో గొంతు కలిపిన జనం.. నిర్బంధాల నడుమ విజయయాత్రలా లోకేష్ పాదయాత్ర!

Publish Date:Mar 2, 2023

Advertisement

తెలుగుదేశంజాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత   లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటింది. అగుగడుగునా జన నీరాజనంతో ఆయన  యాత్ర సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలు చేశారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేశారు. ఆ ముగ్గురూ కూడా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలతో లభించిన ప్రజాదరణ కారణంగానే ముగ్గురూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు.

అయితే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే. కానీ గతంలో జరిగిన మూడు పాదయాత్రలతో పోలిస్తే నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర చాలా ప్రత్యేక మైనది. గతంలో వైఎస్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ పాదయాత్రలు చేసిన సమయంలో ఆంక్షలు లేవు, అవరోధాలు లేవు, అడ్డంకులు లేవు. ప్రభుత్వాలు ఆ పాదయాత్రల సమయంలో పూర్తి భద్రత కల్పించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేశాయి. అవసరమైన అన్ని అనుమతులూ ఇవ్వడమే కాకుండా.. పాదయాత్రలో పాల్గొన్న వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి.

కానీ లోకేష్ పాదయాత్ర కు అలాంటి వెసులుబాటులేవీ లేవు. ఆయన అడుగుతీసి అడుగువేయాలంటే యుద్ధమే చేయాల్సి వస్తోంది. అడుగడుగునా ఆంక్షలే. మాట్లాడుతుంటే పోలీసులు మైకు లాగేసుకుంటున్నారు. నిలుచున్న స్టూలును కూడా తీసేస్తున్నారు. వెంట వచ్చే వాహనాలు లేవు. ప్రచార రథాలను సీజ్ చేసేశారు. ఆయన పాదయాత్రకు రాకుండా జనాలను అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. ఇవి చాలవన్నట్లు అధికార పార్టీయే పాదయాత్రకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తోంది. జనాదరణ లేదు అని ప్రచారం చేయడానికి నానా అగచాట్లూ పడుతోంది. అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ పాదయాత్ర విఫలం అన్న ప్రచారం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరాఖరికి ఆయన పాదయాత్ర కంటే ముందు ఆయన రూట్ లో ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రీకరించి జనం లేని యాత్ర అని బిల్డప్ ఇచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది.

గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేసిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ మాత్రం ఖాళీ రహదారుల ఫోటోల కోసం పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అలా ఖాళీ రహదారల పొటోలు పంపకుంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ హెచ్చరిస్తోంది.  ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.

వీటన్నిటికీ తోడు అధికార పార్టీ శ్రేణుల దాడుల భయం. దాడులను నిరోధించడానికి పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో సాగుతున్నది కనుకనే లోకేష్ పాదయాత్ర   గత పాదయాత్రలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైనది. అలాగే ఎంతో సాహసోపేతమైనదని చెప్పవచ్చు. ఇక లోకేష్ తన పాదయాత్రలో జనంతో మమేకమౌతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.  తనదైన శైలిలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎడాపెడా హామీలిచ్చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చడం గురించి మరచిపోయారు. విపక్షాలు నిలదీసిన సందర్భంగా ఆయన కేబినెట్ సహచరులు ఆ హామీలు జగన్ ఇవ్వలేదని బుకాయించడమే కాకుండా మా మేనిఫెస్టో చూసి మాట్లాడండి అంటూ ఎదురుదాడికి దిగారు. ఇ

ప్పుడు లోకేష్ తన పాదయాత్రలో భాగంగా గతంలో జగన్ ఇచ్చిన మీలను గుర్తు చేసి ప్రజల నుంచే అవి అమలయ్యాయో లేవో తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా తాను ఇచ్చిన హామీలను ప్రతి వంద కిలోమీటర్ల వద్దా శిలాఫలపై చెక్కించి ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన నాలుగు వందల కిలోమీటర్ల పైన సాగిన పాదయాత్రలో నాలుగు శిలాఫలకాలను ఆవిష్కరించారు. తాను ఇచ్చిన హామీలన్నీ శిలాఫలకాలపై ఉన్నాయనీ, వాటిని అధికారంలోకి వచ్చాకా విస్మరిస్తే నిలదీసి ప్రశ్నించాలని ప్రజలకు చెబుతున్నారు. ఇక ఎక్కడిక్కడ సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు ప్రజలలో ఆయన ఇమేజ్ ను పెంచుతోందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.