వైసీపీ నేతలకు అదే పని.. వాళ్ళని సాగనంపటమే ప్రజల పని!

Publish Date:Nov 13, 2023

Advertisement

మొదట లోకేష్.. ఆ తర్వాత చంద్రబాబు.. కాస్త గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్, ఇప్పుడు పురంధేశ్వరి. ఏంటిది అనుకుంటున్నారా?. ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు చేసిన పని. ఒకరిని టార్గెట్ చేయడం.. వారిపై మాటల దాడి చేయడం.. సినీ పరిశమ్ర నుండి ఓ ఇద్దరికి వీరి తాము టార్గెట్ చేసిన వారిపై  అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయాలని చేయాలని ఆదేశించడం, వారు ఆ పనిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించడం, సొంత మీడియాలో రాతలు, ప్రసారాలు, తమ సామాజిక మాధ్యమంలో పోస్టులు ఈ నాలుగున్నరేళ్లలో   జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రభుత్వం , మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన పని ఇదేనని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ముందుగా   నారా లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఆయన ఆహారం నుండి ఆహార్యం వరకూ.. తన నడక నుంచి నడవడిక వరకూ దేనినీ వదలకుండా విమర్శలు చేయడం, హేళన చేయడమే లక్ష్యంగా  వైసీపీ పని చేసింది. అయితే అన్నిటినీ దీటుగా ఎదుర్కొన్న లోకేష్ ఈ నాలుగేళ్ళలో  పరిణితి చెందిన నేతగా ఎదిగారు. తనపై ఒక విమర్శ చేయాలంటే ప్రత్యర్థులు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి వారిని తీసుకు వచ్చారు. 

ఆ తరువాత వైసీపీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన  టార్గెట్ ను షిఫ్ట్ చేసింది.  చంద్రబాబును అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా చేసేందుకు కుట్రలు పన్ని మంచీ, చెడూ, ఉచ్ఛం, నీచం తెలియని, నోరు విప్పితే బూతుపురాణం తప్ప ఓ మంచి మాట మాట్లాడటం రాని మంత్రులు, మాజీ మంత్రులు,  ఎమ్మెల్యేల చేత అవాకులూ, చవాకులూ మాట్లాడించింది.  అప్పటికీ చంద్రబాబు చలించకపోవడంతో కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయించింది.  ఆ తరువాత తెలుగుదేశంతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. మళ్లీ అదే పాత కథ.. ముందు వెనుకలు, పర్యవశానాల గురించి ఆలోచించకుండా జగన్ చెప్పినది తు.చ. తప్పకుండా చేసే ఆస్థాన విద్వాంసుల వంటి నాయకులతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొదలు.. పొత్తు వరకూ, సినీ పరిశ్రమలో ఆయన నైజం నుండి కుటుంబంలో వివాదాల వరకూ దేన్నీ వదలకుండా ఆగమాగం చేశారు. కానీ, పవన్ కళ్యాణ్ దేనికీ లొంగలేదు. ఒక దశలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తన హోదా,  స్థాయి మరచి పవన్ క ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని వేటినీ పవన్ కల్యాణ్ లెక్క చేయలేదు. 

దీంతొ ఇప్పుడు తమ ఆర్థిక అవకతవకలపై, ముఖ్యంగా మద్యం మాఫియాపై గణాంకాలు, ఆధారాలతో సహా విమర్శిస్తున్న, గుట్టు బయట పెడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్ చేసింది వైసీపీ.  ముందుగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి,  ఆ తర్వాత మంత్రి రోజా, నటుడు పోసాని మురళీకృష్ణలు పురంధేశ్వరి టార్గెట్ గా వారికి మాత్రమే చేతనైన భాషలో విమర్శలు చేశారు. ఇక తరువాత వంతుగా  నేడో రేపో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వాళ్ళు,  ఆ వెనుక సామాజిక  మాధ్యమంలో తప్ప మరెక్కడా నోరెత్తని దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంది.  మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేయాల్సిన పనులేవీ ఈ నాలుగున్నరేళ్లలో చేయని వారు.. కేవలం ప్రతిపక్ష నాయకులను  టార్గెట్ చేసి విమర్శల దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారా అనిపించక మానదు.  జగన్ సర్కార్ లో ఏ మంత్రీ కూడా  ఇప్పటి వరకూ తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల గురించి కానీ,  తన శాఖపై వచ్చిన ఆరోపణల గురించి కానీ మీడియా సమావేశం నిర్వహించి వివరించిన సందర్భం ఒక్కటి కూడా కనిపించదు..   ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించడానికి మాత్రమే వారు మీడియాకు ముఖం చూపించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదనిపించేలా వారి వ్యవహారశైలి ఉంది. 

ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏం పనులు చేస్తున్నారో తెలియదు కానీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించిన వారిపై దాడి చేయడమే వీరి పని అన్నట్లుగా వీరి తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక జనం వీళ్లు మారరన్న నిర్ణయానికి వచ్చేసి, వీళ్లనే మార్చేద్దామని ఫిక్సైపోయినట్లుగా కనిపిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.