ఇచ్చిందెంత.. దోచిందెంత? నిగ్గదీసి అడుగుతున్న జనం!

Publish Date:Aug 18, 2023

Advertisement

 ఏదేశమైనా,  ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యం. రాష్ట్రంలో అన్ని వసతులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే ప్రజలకు సంక్షేమం అందుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న ప్రక్రియ. ఈ ప్రక్రియను అవలంబిస్తేనే ఏ ప్రభుత్వమైనా నిలబడేది. మాది భిన్నమైన పాలన.. కేవలం సంక్షేమమే మా నినాదం అంటే ఆ ప్రభుత్వం బొక్కబోర్లా పడడం ఖాయం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా  ఉంటేనే ఆ రాష్ట్రం సుభీక్షంగా ఉంటుంది. ఇందులో ఏది వదిలేసినా ఆ రాష్ట్రంలో   ప్రజల ఆర్ధిక స్థితి దిగజారడం, వలసలు పెరగడం వంటివి తప్పదు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే. 

రాష్ట్రానికి ఇతర దేశాల పెట్టుబడులు చాలా అవసరం. అందుకే ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకొని.. రాష్ట్రానికి వస్తే రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తుంటారు. టీడీపీ హయంలో కూడా గన్నవరం విమానాశ్రయానికి కొన్ని మెరుగు దిద్ది అంతర్జాతీయ విమానాల రాక కోసం ప్రభుత్వం విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కొన్ని నెలల పాటు ప్రభుత్వమే కొన్ని టికెట్ల ధరను చెల్లించేలా ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో అంతర్జాతీయ   రూట్లలో సర్వీసులు మొదలు అయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రాయతీలు ఆపేశారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక మాట చెప్పారు. విమాన సర్వీసుల కంటే తల్లీ బిడ్డల ఆరోగ్యం ముఖ్యమని, ఆ రాయితీలు ఆపేసి ఆ డబ్బును గర్భిణీ, బాలింతల పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.

 ఆనాడు బుగ్గన చెప్పిన ఆ మాటలు ఆహా ఓహో అనిపించి ఉండొచ్చు. జగన్ సర్కార్ పేదల కోసమే ఆలోచిస్తుందని, సంక్షేమ ఫలాలు తమకు అందుతాయని ప్రజలు భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవంలో  వైసీపీ పంచేందుకు ఇప్పుడు తగిన ఆదాయం లేదు. కొండలా పేరుకుపోయిన అప్పులతో కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడానికే పరిమితమైంది. పరిశ్రమలు రాక.. పెట్టుబడి దారులు రాష్ట్రం వైపు చూడక నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది. ఆదాయం సరిపోక ప్రభుత్వం రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రోత్సాహక రాయతీలు వంటి వాటికి మంగళం పాడేసింది. కేవలం ఏ నెలకి ఆనెల వచ్చే ఆదాయానికి తోడు మరికొంత అప్పుచేసి పెన్షన్లు, జీతాలు, సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికే పాలన పరిమితమైపోయింది.

 దీంతో ఏపీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై ఒకరకమైన ఏహ్య భావన కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కొత్తగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువే సంక్షేమాన్ని అందించారు. జగన్ వాటికి పేర్లు మార్చి నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు. దానికి కూడా భారీగా ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. రేషన్ డోర్ డెలివరీ లాంటి పథకాలు హంబక్ కావడం.. ప్రకటించే ప్రతి పథకానికి వంద కొర్రీలు పెడుతూ కోతలు విధించడంతో.. ఆ ఫలాలు అందినా ప్రజలలో సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీలో అంతర్మధనం మొదలైంది.

తాము ఇంత చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదేంటి అని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పీపుల్ సర్వేలు తీసుకుంటున్నారట. అయితే, కొందరు లబ్ధిదారులు లెక్కలేసి మరీ మీరిచ్చింది ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. ఇదిగో మేము కుటుంబానికి రూ.2 లక్షల వరకూ ఇచ్చామని వైసీపీ నేతలు చెప్తుంటే.. ప్రజలు తిరిగి నేతలకు దిమ్మతిరిగే సమాధానమిస్తున్నారు. మీరిచ్చే దానిలో పెన్షనే  అధిక భాగం పెన్షనే ఉందనీ.. పైగా ఉందని.. అది గత ప్రభుత్వంలోనే పెంచారని, మిగతా మొత్తం గత ప్రభుత్వంలో కూడా అందిందని.. ఇప్పుడు వాటి పేర్లు మార్చి మాయ చేసారని లెక్కలు చెప్పడంతో నేతల ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు, మీరిచ్చిన దాని కంటే వందరెట్లు ఎక్కువగా రేట్లు పెంచి మా దగ్గర నుండి లాగేసుకున్నారని  గణాంకాలతో సహా చెబుతున్నారు.ఈ ప్రజా చైతన్యం వైసీపీకి కాళ్ల కింద భూమిని కదిలించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సంగతి అటుంచి.. అసలు ప్రచారం కోసం జనం ముందుకు వెళ్లడం ఎలా అన్న గుబులు వారిలో మొదలైందంటున్నారు.  

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.