క్రౌడ్ ఫండింగ్ తో ప్రజా సమస్యల పరిష్కారం!

Publish Date:Jun 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అరాచక సర్కార్ కుప్పకూలింది. తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలతో ముందుగు సాగుతున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత వరకూ వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. 

ఇక ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.  నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం రఘురామకృష్ణం రాజు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తిన పాపానికి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి సేవలందించే విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.  

గతంలో నారాచంద్రబాబునాయుడు ప్రజాభాగస్వామ్యంతో సమస్యలు పరిష్కారం అయ్యేలా జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ కార్యక్రమం ద్వారా గ్రామాలలో రోడ్లు, పూడికతీత వంటి ఎన్నో పనులు విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ప్రజలు 30శాతం నిధులు భరిస్తే మిగిలినది ప్రభుత్వం ఇచ్చి పనులను వేగవంతంగా పూర్తి చేయడమే జన్మభూమి కార్యక్రమం. ఇప్పుడు తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి రఘురామకృష్ణం రాజు క్రౌడ్ ఫండింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే గ్రామాలలో ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిధులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా అంటే నిధుల సమీకరణ ద్వారా సేకరిస్తారు. అలా వచ్చిన నిధులతో పనులు పూర్తి చేస్తారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారం అవసరంలేని పనులను ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధులతో పూర్తి చేస్తారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తన వంతుగా ముందుగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.  ఇప్పటి వరకూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం రైజ్ చేసిన ఫండ్ కోటి రూపాయల వరకూ చేరిందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అవలంబిస్తే రాష్ట్రంలో సమస్యలు చాలా వరకూ పరిష్కారం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.