Publish Date:Jul 22, 2024
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేష్.. సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించడంలో తనకు తానే సాటి, పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్య చిటికెలో పరిష్కారం అయిపోతోంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ ఏ మాత్రం జాగు లేకుండా స్పందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో దివ్యాంగుల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్న జీవోను సవరించడంలో కానీ, ఎక్కడో గల్ఫ్ దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వ్యక్తిని రోజుల వ్యవధిలో స్వరాష్ట్రానికి చేర్చడంలో కానీ లోకేష్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ తీసుకుంటున్నారు. తన నివాసంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా, ఈమెయిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా స్పందిస్తున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా మర్లమాడి గ్రామానికి చెందిన విద్యార్థులు ఒక ఈమెయిల్ ద్వారా తమ గ్రామానికి బస్సులేకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవస్థలను లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే వెంటనే ఆ గ్రామానికి బస్సు వచ్చేసింది. విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోయాయి. అంతే కాదు తన సహాయం కావలసిన వారెవరైనా సరే hello.lokesh@ap.gov.in అడ్రస్ కు ఈమెయిల్ చేస్తే చాలని లోకేష్ చెబుతున్నారు.
లోకేష్ ఒరవడిని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కూటమి మంత్రులు అనుసరిస్తున్నారు. చిటికెలో సమస్యలు పరిష్కరంచేస్తున్న లోకేష్ వేగాన్ని తాము అందుకుంటామని చెబుతున్నారు. ఇలా లోకేష్ సహచర మంత్రులకు ఒక టాస్క్ ఫిక్స్ చేశారనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-problems-solve-in-no-time-39-181215.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.