భయాన్ని వదిలి దండయాత్ర మొదలు పెట్టిన ప్రజలు!

Publish Date:Aug 20, 2023

Advertisement

సంక్షేమమే మా ఎజెండా.. పేదల పాలిట పెన్నిధి మా ప్రభుత్వం.. మా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేద ప్రజల కోసమే. ఈ నాలుగేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న మాటలు ఇవే. అయితే, ప్రజలలో మాత్రం   తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రభుత్వంపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నారు. అభివృద్ధి అనే మాట ఎక్కడా కనిపించడం లేదన్నది ఇక్కడి ప్రజల ప్రధాన ఆరోపణ. అయితే, పల్లె జనంలో కూడా ఈ వ్యతరేకత వ్యక్తమవుతోందనడానికి నిలువెత్తు నిదర్శనం తాజాగా జరిగిన పంచాయతీ, వార్డు ఎన్నికలు. ఈ ఎన్నికలలో వైసీపీకి కంచుకోటల్లాంటి పంచాయతీలు కొట్టుకుపోగా.. ఇంటింటికీ తిరిగినా వార్డు అభ్యర్థులకు ప్రజలు మొహం చాటేశారు. మీకు అంత ఇచ్చాం.. ఇంత ఇచ్చాం.. అది చేశాం.. ఇది చేశామని ప్రజల చెవులలో జోరీగలుగా ప్రచారం చేసినా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు తిప్పికొట్టారు.

నిజానికి ఇవి గ్రామ స్థాయి ఎన్నికలు.. ఈ ఎన్నికలలో ఎక్కడా పార్టీల గుర్తులు ఉండవు. కానీ, పార్టీ తరపున వారు బలపరిచిన వారే బరిలో దిగుతారు. మరోవైపు ప్రజలు కూడా స్థానిక గ్రామ రాజకీయాల్ని మాత్రమే ఎజెండాగా తీసుకుని ఓట్లు వేస్తారు. గ్రామాలలో అధికార పార్టీ ఏం చేసింది? గ్రామాలలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? గ్రామ స్థాయి అధికార పార్టీ లీడర్లు ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారు? గ్రామ స్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తత్వం ఏంటి? తనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకుడు తమకు అండగా ఉంటారా? ఇలాంటి ఎన్నో అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సహజంగా ఇలాంటి స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ హవా కనిపిస్తుంది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారేమో.. ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రోత్సాహకాలను తమకు అందకుండా చేస్తారేమో, స్థానిక నాయకుల నుండి తమకి వేధింపులు ఉంటాయేమో అనే భయాందోళన ఉంటుంది.

 నిజానికి అధికార వైసీపీ ఈ స్థానిక ఎన్నికలలో విజయం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్నీ చేసింది. తమకు ఓటెయ్యకపోతే పెన్షలు, విద్యాదీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలను ఆపేస్తామని కూడా బెదిరించారు. పలు చోట్ల వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఓటేస్తారా? లేక అన్ని పథకాలను కత్తిరించాలా అని తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రజలు చాలా చోట్ల అన్ని భయాలను వదిలి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఎలాగు గుర్తు లేని ఎన్నికలు కనుక గెలిచిన వారంతా తమ పార్టీ నేతలే అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. అయితే, స్థానికంగా ఎక్కడిక్కడ తిరుగుబాటు పరిస్థితి కనిపిస్తున్నది. నాలుగేళ్లుగా ఎన్నో బెదిరింపులు చూశాం.. మహా అయితే మరో ఎనిమిది తొమ్మిది నెలలే కదా అనే ధోరణి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది. 

ఉదాహరణకి ప్రకాశం జిలా సింగరాయకొండకి చేరువలో ఉండే పాకల అనే గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఇప్పటి వరకూ గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. వైసీపీ ఆవిర్భావం తర్వాత వాళ్ళే గెలుస్తూ వచ్చారు. కానీ, తొలిసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసింది. సముద్రాన్ని అనుకోని ఉండే ఈ గ్రామంలో ఎక్కువ శాతం మత్స్యకారులే ఉంటారు. వీరి ప్రధాన జీవనాధారం చేపలవేట. అయితే, మత్య్సకారులకు ఎన్నో చేశామని ప్రభుత్వం గొప్పలు పోతున్న సంగతి తెలిసిందే. అయినా ఈ గ్రామ ప్రజలు చరిత్రను తిరగ రాస్తూ తీర్పునిచ్చారు. గోదావరి జిల్లాల్లో కూడా పలు చోట్ల ఇదే ప్రభంజనం కనిపించింది. గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన అభర్ధులు విజయకేతనం ఎగరేశారు. ఇప్పటికే ఈ మధ్యనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే నిద్ర పట్టని పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలతో ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చినట్లే భావించాలి.

By
en-us Political News

  
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.