జగన్ మేనిఫెస్టోపై వైసీపీ సోషల్ మీడియా అతి!

Publish Date:Apr 27, 2024

Advertisement

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ  జ‌గ‌న‌న్న అంత మ‌తిపోయే ప‌ని ఏం చేశాడ‌ని అనుకుంటున్నారా..?  ఇన్నాళ్లు జ‌గ‌న‌న్న చేసిన‌వ‌న్నీ ప్ర‌జ‌ల‌కు మ‌తులు పోగ‌ట్టే ప‌నులే క‌దా.. ఇంకా కొత్త‌గా ఏముంది మ‌తిపోవ‌టానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మ‌తిపోవాల్సిందే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ మ్యానిఫెస్టోను శ‌నివారం (ఏప్రిల్ 27) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలోనూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ పెట్టుకున్నారు. చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ట‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి  చేయ‌లేనంత మంచి ప‌నులు పేద‌ల‌ కోసం చేశారంట‌. అడిగేవాడు లేక‌పోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అన్న‌ట్లుగా మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ ప్రసంగం ఉంది.

 ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌నే స్వ‌భావంతోనే పాల‌న సాగించారు. ఐదేళ్ల కాలంలో ఆయ‌న్ను ప్ర‌శ్నిచిన ఎవ‌ర్నీ జ‌గ‌న్ వ‌దిలిపెట్ట‌లేదు. చంద్ర‌బాబు నుంచి.. ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర‌కు ఎవ్వ‌రూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క‌ పాలన నుంచి త‌ప్పించుకోలేక పోయారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకొచ్చిన కంపెనీల‌ను త‌రిమేసిన జ‌గ‌న్‌.. క‌నీసం రోడ్ల‌పై ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయించ‌లేక పోయారు. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై మండిప‌డుతున్నా.. వైసీపీ అనుకూల మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన   హామీలన్నీ నెర‌వేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో 99శాతం హామీలు నెర‌వేర్చామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డంపై జనం విస్మయం  వ్య‌క్తం చేస్తున్నారు.

 ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చి ఎలాంటి భ‌యం లేకుండా  ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ర్యాలీలు, స‌భ‌ల్లో పాల్గొంటుంటే ఆ ఆనంద‌మే వేరు అన్న‌ట్లుగా జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇది విన్న ప్ర‌జ‌లు.. మ‌రి   ఇన్నాళ్లు ప‌ర‌దాల మాటున ఎందుకు తిరిగావ్ జ‌గ‌న‌న్నా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేసి.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన కాసింత అభివృద్ధినికూడా నిర్వీర్యం చేయ‌డం త‌ప్పితే జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా  చేసింది ఏమీలేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ళ్ల‌ముందు ఇన్ని వాస్త‌వాలు క‌నిపిస్తున్నా, వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో ప‌లు వీడియోలు ప్ర‌త్య‌క్ష మ‌య్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మ్యానిఫెస్టోలో కొత్త ప‌థ‌కాలు ఏంఏం ప్ర‌క‌టిస్తున్నారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.. మ‌రొక వీడియోలో మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంద‌రు మ‌హిళ‌లు ఏకంగా హార‌తి ఇచ్చేస్తున్నారు.. మ‌రో వీడియోలో కొంద‌రు గ్రామ‌స్తులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో చ‌దువుతుంటే ఉత్కంఠ‌భ‌రితంగా టీవీని వీక్షిస్తున్నారు.

ఒక‌ప‌క్క వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తుంటే.. మ‌రోప‌క్క వైసీపీ సోష‌ల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న టీంకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందంటూ కామెంట్ల‌తో త‌మ ఆగ్ర‌హాన్ని వెలుబుచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే   స‌ర్వేల‌న్నీ తేల్చేశాయి. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్న జ‌గ‌న్.. ఎలాగైనా ప్ర‌జ‌ల‌ను మ‌యాచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని  అన్నిప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే గుల‌క‌రాయి డ్రామాను తెర‌పైకి తెచ్చిన‌ప్ప‌టికీ.. అది తుస్సుమంది. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు గుల‌క‌రాయి డ్రామాను ఈడ్చిత‌న్నారు. అయినా  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి సినిమా లెవ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ముంద‌స్తుగా రూపొందించిన వీడియోల‌ను వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్లాట్ ఫాంల‌లో ప్ర‌జ‌ల‌పైకి వ‌దిలారు. ఇలాంటి ట్రిక్ ల‌ను జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ఎన్ని ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు మాత్రం  ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

By
en-us Political News

  
తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఓపెన్ లెటర్ రాశారు
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు , ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది
నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్.
నీట్‌ పరీక్షలో అక్రమాలకు గుజ‌రాత్ కేంద్రంగా మారింది. గుజరాత్ లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షల రూపాయ‌లిస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దివంగత వైఎస్ సతీమణి, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తాను ఎవరివైపో స్పష్టంగా చెప్పేశారు. తన కుమార్తె షర్మిలకే తన మద్దతు అని విస్పష్టంగా ప్రకటించేశారు.
హైదరాబాద్ బిజెపి ఎంపీ  అభ్యర్థి మాధవీలత పోలీసులకు  మాస్ వార్నింగ్  ఇచ్చారు. పోలింగ్ కు ఇంకా రెండు రోజులు కూడా లేకపోవడంతో ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఇస్తుందని ఆరోపిస్తున్న మాధవీలత నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులను ఊరుకునేది లేదని హెచ్చరించారు.
2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం నన్ను కట్టిపడేశాయి. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను.
ఇప్పటికే తమ భూముల పాస్‌బుక్‌ల మీద ప్రత్యక్షమైన జగన్, దేశంలో ఎక్కడా లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా తమ భూములు తమకు కాకుండా పోతాయన్న భయం అందరిలోనూ వుంది.
కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.